Swetha
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డేస్ రానే వస్తున్నాయి. రాజాసాబ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మొదలయ్యాయి. తాజాగా రాజాసాబ్ నుంచి రెండో ఆడియో సింగిల్ వచ్చేసింది . ఈసారి మారుతి ఆడియో తో పాటు వీడియో సాంగ్ ను కూడా వదిలేసారు. ఈ సాంగ్ లో వింటేజ్ డార్లింగ్ బయటకు వచ్చేలా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మారుతి .
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డేస్ రానే వస్తున్నాయి. రాజాసాబ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మొదలయ్యాయి. తాజాగా రాజాసాబ్ నుంచి రెండో ఆడియో సింగిల్ వచ్చేసింది . ఈసారి మారుతి ఆడియో తో పాటు వీడియో సాంగ్ ను కూడా వదిలేసారు. ఈ సాంగ్ లో వింటేజ్ డార్లింగ్ బయటకు వచ్చేలా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మారుతి .
Swetha
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డేస్ రానే వస్తున్నాయి. రాజాసాబ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ మొదలయ్యాయి. తాజాగా రాజాసాబ్ నుంచి రెండో ఆడియో సింగిల్ వచ్చేసింది . ఈసారి మారుతి ఆడియో తో పాటు వీడియో సాంగ్ ను కూడా వదిలేసారు. ఈ సాంగ్ లో వింటేజ్ డార్లింగ్ బయటకు వచ్చేలా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మారుతి . కాస్ట్యూమ్స్, లొకేషన్స్ , ఎడిటింగ్ ఇలా అన్నీ విధాలా చాలా పర్ఫెక్ట్ గా సాంగ్ సింక్ అయింది. గత కొన్నేళ్లుగా ప్రభాస్ కత్తి పట్టడం , ఫైట్ లు చేయడం ఇదే లుక్ లో చూసి చూసి ఉన్న కళ్ళకు.. ఈ సహన సహనా కాస్త కనువిప్పు కలిగించిందన్న మాట వాస్తవం . డార్లింగ్ అభిమానులు కాస్త ఫ్రెష్ ఫీల్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
చూడడానికి మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాలో కళావతి సాంగ్ ప్యాట్రన్ లా అనిపించింది . ఆ రేంజ్ లో ఇది వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే సినిమా హైప్ ను అమాంతం పెంచేసేలా ఉందా అంటే ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. ప్రేక్షకులు ఇంకా ఇదో ఆశిస్తున్నారనేది వాస్తవం. కాకపోతే స్లో స్లో గా స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కేస్తుంది. రీసెంట్ గా వచ్చిన అగ్ర హీరోల సాంగ్స్ అనీ కూడ ఇలానే స్లో గానే ఎక్కాయి. సరే ఇదంతా ఏది ఎలా ఉన్నా అభిమానులు మాత్రం శాటిస్ఫై అయ్యారు.
ఇక ఇప్పటివరకు రెండు సాంగ్స్ , ఒక టీజర్ , ఓ ట్రైలర్ వచ్చాయి . జనవరి 9 కి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. కాబట్టి రాజాసాబ్ టీం వీలైనంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అసలే పండగ సమయంలో వస్తున్నా మొదటి సినిమా కాబట్టి యునానిమస్ టాక్ సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముగ్గురు హీరోయిన్స్ తో డార్లింగ్ చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. ముందు ముందు సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ సినిమా మీద క్రేజ్ ను పెంచుతాయని చెప్పొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.