Swetha
2025 లో రావాల్సిన సినిమాలన్నీ వచ్చేశాయి. ఈ ఇయర్ అఖండ 2 తో అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు మిగిలే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు కాకపోవచ్చు కానీ కంటెంట్ ఉన్న సినిమాలే అని చెప్పొచ్చు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి
2025 లో రావాల్సిన సినిమాలన్నీ వచ్చేశాయి. ఈ ఇయర్ అఖండ 2 తో అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు మిగిలే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు కాకపోవచ్చు కానీ కంటెంట్ ఉన్న సినిమాలే అని చెప్పొచ్చు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి
Swetha
2025 లో రావాల్సిన సినిమాలన్నీ వచ్చేశాయి. ఈ ఇయర్ అఖండ 2 తో అయిపోయింది అనుకుంటే పొరపాటే. ఇంకా రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు మిగిలే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు కాకపోవచ్చు కానీ కంటెంట్ ఉన్న సినిమాలే అని చెప్పొచ్చు. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి . మరి ఆ సినిమాలేంటో .. వాటి ప్రత్యేకతలు ఏంటో చూసేద్దాం.
ఛాంపియన్ : ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటిస్తున్నాడు. ఇది ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా . రోషన్ తో పాటు అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి.
దండోరా : శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు మురళికాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మీద సోషల్ మీడియాలో హైప్ బాగానే ఉంది. ఇక స్టోరీ ఎలా ఉంటుందో చూడలంటే డిసెంబర్ 25 వరకు వెయిట్ చేయాల్సిందే.
శంబాల : సాయికుమార్ కుమారుడు ఆది నటిస్తున్న సినిమా ఇది. ఆది కి ఈ మధ్య కాలంలో మంచి హిట్ పడింది లేదు. ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా గీత మాధురి పాడిన సాంగ్ కూడా బాగానే హిట్ అవుతుంది. ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ లాంటి నటీనటులు నటిస్తున్నారు.
ఇవి కాకుండా ఈషా , పతంగ్ , బ్యాడ్ గర్ల్స్ , సిరై , మార్క్ , వృషభ, వానర, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వంటి సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. కాబట్ట ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.