Swetha
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ శ్రీ విష్ణు . ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు టైమింగ్ , స్క్రిప్ట్ సెలక్షన్ అన్నీ అదిరిపోతున్నాయని చెప్పాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో విష్ణు సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే పాయింట్ ను విష్ణు బాగా అర్థంచేసుకున్నాడేమో అనిపిస్తుంది. సామజవరగమన , సింగిల్ లాంటి సినిమాల తర్వాత శ్రీ విష్ణు మీద అందరికి అంచనాలు పెరిగిపోయాయి.

కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ శ్రీ విష్ణు . ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు టైమింగ్ , స్క్రిప్ట్ సెలక్షన్ అన్నీ అదిరిపోతున్నాయని చెప్పాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో విష్ణు సక్సెస్ ట్రాక్ లో నడుస్తున్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే పాయింట్ ను విష్ణు బాగా అర్థంచేసుకున్నాడేమో అనిపిస్తుంది. సామజవరగమన , సింగిల్ లాంటి సినిమాల తర్వాత శ్రీ విష్ణు మీద అందరికి అంచనాలు పెరిగిపోయాయి. దీనితో అతని మీద అందరిని నవ్వించే బాధ్యత పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు జాతకాల పిచ్చి అనే పాయింట్ తో వస్తున్నాడు.
ఈ పాయింట్ మీద ఎంతమంది ఎన్ని సార్లు సినిమా తీసిన ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. కాకపోతే అది ఆ డైరెక్టర్ హీరో మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాన్సెప్ట్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది కాబట్టి విష్ణు ఎలాంటి విన్యాసాలు చేసి నవ్విస్తాడు అనేది చూడాలి. ఈ సినిమా టైటిల్ కూడా ఇదే “విష్ణు విన్యాసం” . ఈ సినిమాతో యధునాథ్ మారుతీరావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాలో నయన సారిక హీరోయిన్ గా చేయబోతుంది. తాజాగా మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ను కూడా రిలీజ్ చేశారు.
ఆ గ్లిమ్ప్స్ చూస్తే గతంలో ఈవివి సత్యనారాయణ తీసిన ఆ ఒక్కటి అడక్కు సినిమా గుర్తురావడం ఖాయం. అందులో రాజేంద్రప్రసాద్ కు జాతకాల పిచ్చి.. ఆ పాయింట్ ను ఎంతలా వాడుకోవాలో అంతలా వాడేశారు. ఇక ఇప్పుడు ఆ పాయింట్ ను తీసుకుని శ్రీవిష్ణు ఎలా నవ్విస్తాడు అనేది చూడాలి. ఈ సినిమా కాకుండా కామ్రేడ్ కళ్యాణ్ అనే మరో సినిమాను కూడా కంప్లీట్ చేసాడు శ్రీ విష్ణు . అది కూడా కామిడి కథేనట. ఇక ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.