Swetha
డిసెంబర్ లో అఖండ 2 తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మరో సినిమా అవతార్ 3 . మొదట వచ్చిన అవతార్ పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలియనిది కాదు. దీనితో ఫ్రాంచైజ్ ను మొదలుపెట్టారు అవతార్ టీం . ఆ తర్వాత వచ్చిన పార్ట్ 2 కి కూడా మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది.
డిసెంబర్ లో అఖండ 2 తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మరో సినిమా అవతార్ 3 . మొదట వచ్చిన అవతార్ పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలియనిది కాదు. దీనితో ఫ్రాంచైజ్ ను మొదలుపెట్టారు అవతార్ టీం . ఆ తర్వాత వచ్చిన పార్ట్ 2 కి కూడా మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది.
Swetha
డిసెంబర్ లో అఖండ 2 తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మరో సినిమా అవతార్ 3 . మొదట వచ్చిన అవతార్ పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో తెలియనిది కాదు. దీనితో ఫ్రాంచైజ్ ను మొదలుపెట్టారు అవతార్ టీం . ఆ తర్వాత వచ్చిన పార్ట్ 2 కి కూడా మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ డిసెంబర్ 19న అవతార్ పార్ట్ 3 రాబోతుంది . మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ బుకింగ్స్ , సోషల్ మీడియాలో హడావిడి.. సినిమా గురించి హైప్ అవన్నీ కనిపించాలి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
అవతార్ సెకండ్ పార్ట్ తో కంపేర్ చేస్తే ఈసారి ఓపెనింగ్స్ తో పాటు.. ఫైనల్ కలెక్షన్స్ కూడా తక్కువగానే ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది. కేవలం ఇండియా నుంచే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు గ్రాస్ ను ఆశిస్తున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు అది అయ్యే పనిలా కనిపించడం లేదు. అవతార్ కు ఉన్న క్రేజ్ తగ్గిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ విధంగా తగ్గిందనే చెప్పొచ్చు. మొదటిసారి ఏదైనా వింత చూసినప్పుడు కలిగే ఎగ్జైట్మెంట్.. రేండో సారికి కాస్త తగ్గిపోతుంది.. మూడోసారి ఇంకాస్త తగ్గిపోతుంది. ఇప్పుడు అవతార్ విషయంలో జరుగుతున్నది కూడా అదే.
పైగా అవతార్ 2 వచ్చినప్పుడే అంచనాలను అందులోలేకపోయిందనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ అంటూ మూడో భాగాన్ని తెరమీదకు తీసుకుని వస్తున్నారు. ఇది కాస్త మ్యాజిక్ చేస్తే తప్ప నిర్మాతలు సేఫ్ అవ్వరు. దీనితో ఆపేస్తారా లేదా ఈ ఫ్రాంచైజ్ ను కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మన దేశంలో.. ఎనభై వేల టికెట్స్ దాకా అమ్ముడయ్యాయట. రికవరీకి ఇది సరిపోదు.. ఇంకా చాలా పెరగాల్సి ఉంటుంది. ఫస్ట్ డే కనీసం నలభై కోట్ల ఓపెనింగ్స్ రావాలి.. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.