iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ రన్ టైం ఎంతంటే !

  • Published Dec 16, 2025 | 11:30 AM Updated Updated Dec 16, 2025 | 11:30 AM

రాజాసాబ్ ఇంకొద్ది రోజుల్లో థియేటర్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది . డార్లింగ్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మూవీ టీం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది. ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసి ఉండాలిలే కానీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు వెయిట్ చేశారట .

రాజాసాబ్ ఇంకొద్ది రోజుల్లో థియేటర్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది . డార్లింగ్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మూవీ టీం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది. ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసి ఉండాలిలే కానీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు వెయిట్ చేశారట .

  • Published Dec 16, 2025 | 11:30 AMUpdated Dec 16, 2025 | 11:30 AM
రాజాసాబ్ రన్ టైం ఎంతంటే !

రాజాసాబ్ ఇంకొద్ది రోజుల్లో థియేటర్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది . డార్లింగ్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మూవీ టీం అంతా కూడా ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది. ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసి ఉండాలిలే కానీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు వెయిట్ చేశారట . అదీ కాకుండా కొన్ని షూటింగ్ పనులు కూడా పెండింగ్ ఉండడంతో ఇప్పటివరకు సమయం పట్టింది. ఇప్పుడు ఎలాగూ టైం దొరికింది కాబట్టి మూడు వారాల ముందే సెన్సార్ కాపీ రెడీ చేశారట రాజాసాబ్ టీం.

క్రిస్మస్ లోపు అన్నీ భాషల్లోనూ సెన్సార్ కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకంటే సంక్రాంతి సమయంలో మొత్తం ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెన్సార్ బోర్డు కూడా బిజీగా ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసుకుంటుంది రాజాసాబ్ టీం. ఇక ఇది కాకుండా ఈ సినిమా రన్ టైం గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. ఈ సినిమాకు 3 గంట‌ల 15 నిమిషాల ర‌న్ టైమ్ తో సెన్సార్ కాపీ సిద్ధం చేశార‌నే టాక్ వినిపిస్తుంది.

అయితే ఫైనల్ కట్ కోసం మొత్తం మీద ఓ 15 నిముషాలు ట్రిమ్ చేయొచ్చట. సో థియేటర్లో మూడు గంటల సినిమా ప్లే అవుతుంది. ఇప్పుడు మూడు గంటల సినిమా పెద్ద మ్యాటర్ ఏమి కాదు. అందులోను డార్లింగ్ సినిమా అంటే అభిమానులు ఇంకో 15 నిమిషాలు ఎక్స్ట్రా అయినా చూస్తారు. సో ఫైనల్ రన్ టైం ఎంత లాక్ చేస్తారో చూడాలి. ఇప్పటివరకు రాజాసాబ్ నుంచి ఓ టీజర్ , ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇంకా అది సినిమా మీద ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.