iDreamPost
android-app
ios-app

అఖండ 2 ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై ఉంటుందా !

  • Published Dec 15, 2025 | 10:58 AM Updated Updated Dec 15, 2025 | 10:58 AM

టాలీవుడ్ లో 2025 అఖండ 2 తో ముగిసింది. ఇక మళ్ళీ రాజాసాబ్ , మన శంకర వరప్రసాద్ గారు లాంటి సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు.. థియేటర్లో చెప్పదగిన సినిమాలు ఏమి లేవు. అయితే ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై ఉంటుందేమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఒకటి టికెట్ రేట్స్ విషయంలో మరొకటి బిజినెస్ పరంగా

టాలీవుడ్ లో 2025 అఖండ 2 తో ముగిసింది. ఇక మళ్ళీ రాజాసాబ్ , మన శంకర వరప్రసాద్ గారు లాంటి సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు.. థియేటర్లో చెప్పదగిన సినిమాలు ఏమి లేవు. అయితే ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై ఉంటుందేమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఒకటి టికెట్ రేట్స్ విషయంలో మరొకటి బిజినెస్ పరంగా

  • Published Dec 15, 2025 | 10:58 AMUpdated Dec 15, 2025 | 10:58 AM
అఖండ 2 ఎఫెక్ట్  సంక్రాంతి సినిమాలపై ఉంటుందా !

టాలీవుడ్ లో 2025 అఖండ 2 తో ముగిసింది. ఇక మళ్ళీ రాజాసాబ్ , మన శంకర వరప్రసాద్ గారు లాంటి సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు.. థియేటర్లో చెప్పదగిన సినిమాలు ఏమి లేవు. అయితే ఇప్పుడు అఖండ 2 ఎఫెక్ట్ సంక్రాంతి సినిమాలపై ఉంటుందేమో అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఒకటి టికెట్ రేట్స్ విషయంలో మరొకటి బిజినెస్ పరంగా. మొదటి రీజన్ విషయానికొస్తే.. ప్రీమియర్ టికెట్ రేట్లు ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటున్నాయని అంతా అంటున్నారు. ఎంత ఎక్కువ ఉన్నా సరే చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు అది వేరే విషయం.

కానీ సాధారణ ప్రేక్షకులు కూడా భరించ గలిగే రేట్లు ఉండడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. మేకర్స్ రాజాసాబ్ సినిమాకు భారీగానే ఖర్చు చేశారు . అదంతా రికవరీ చేయాలంటే రేట్లు పెంచాల్సిందే. మరి ఇప్పుడు ఈ సినిమాకు ఎంత టికెట్ రేట్ పెడతారో చూడాలి. అసలే పండగ జనం ఖర్చుచేస్తారా లేదా అనేది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పైగా ఆ వెంతంటే పండక్కి మన శంకర వర ప్రసాద్ గారు కూడా వస్తున్నారు. మామూలు టికెట్ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గానే ఉంది. ఇవన్నీ అఖండ 2 కి ఆటంకాలుగానే మారాయి. సో అఖండ 2 ఎఫెక్ట్ ఈ సినిమాలపై పడే అవకాశం లేకపోలేదు.

అలాగే బిజినెస్ పరంగా కూడా కాస్త ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సినిమాల రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయమే ఉంది. ఈలోపే ఇవన్నీ క్లియర్ అయిపోతే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాలు అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వొచ్చు. పైగా మూవీ టీం వారు కూడా ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ పనులు మొదలుపెట్టలేదు. వీరు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో.. ఆయా సినిమాల నుంచి కొత్త అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.