వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనని ఏపీ ప్రజలు చాలామంది మరచిపోలేదు. ముఖ్యంగా ఆయన పాలనా పద్ధతులను పరిశీలించిన వారే కాకుండా వాటి ఫలితాలను అందుకున్న తరం కూడా వైఎస్సార్ ని అనేక సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఫీజు రీయంబెర్స్ మెంట్ ద్వారా ఫలితం పొందిన విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న సమయంలో చాలామందికి ఆ పథకం ప్రారంభించిన నాయకుడు గుర్తుకొస్తూనే ఉంటారు. అయితే తూర్పు తీరంలోని ఓ మత్స్యకార గ్రామం నిత్యం వైఎస్సార్ […]
బావా.. బావా.. అంటూ వీధి గేటుదగ్గర్నుంచి మెల్లగా గొంతు విన్పిస్తుంటే బాలకృష్ణ సినిమాను కన్నార్పకుండా చూస్తున్న కిట్టయ్య లోపల్నుంచి వచ్చి చూసాడు. చూడ్డం తోటే.. అదేంట్రా మణీ అక్కడే ఆగిపోయి.. కేకేస్తున్నావేంట్రా.. అన్నాడు ఆశ్చర్యంగా. ఏం.. లేదు బావా. కరోనా కారణంగా నువ్వసలు గేటే తీయడం లేదటకదా.. ఎవ్వరు వచ్చినా.. గేటు బైటే నిలబెట్టి మాట్లాడేస్తున్నావని ఊళ్ళో పెద్ద టాకై కూర్చుంది. నేనొచ్చినా తీస్తావో? లేదో? అని అనుమానం వచ్చి.. పిలుస్తున్నాను.. అన్నాడు మణి. ఒరే మణీ.. […]
ఒకప్పుడు టీడీపీకి, ఇప్పుడు వైఎస్సార్సీపీకి కంచుకోటగా చెప్పుకునే మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కన్వీనర్‌గా ఉన్న వేగుళ్ళ లీలాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై బెంగలో ఉన్నారని ఆ నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చురుకైన రాజకీయాలతో ప్రజల్లో తనదైన ముద్ర వేసిన లీలా కృష్ణ ప్రస్తుతం నెమ్మదించడంతో ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయని మరికొందరు అంటున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంలో ఆ పార్టీ మండపేట కో ఆర్డినేటర్‌గా పనిచేసిన లీలా కృష్ణ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలోకి […]
సీయం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా టీడీపీ నాయకులు ఎవరో ఒకరు వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు గుప్పించేస్తుంటారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలెండర్‌పై కూడా మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు యథాప్రకారం తన విమర్శల ‘డ్యూటీ’నీ చేసేసారు. ప్రెస్‌మీట్ పెట్టి కోటి ఉద్యోగాలు పొగోట్టారంటూ కొసమెరుపు కూడా ఇచ్చేసారు. పనిలో పనిగా ప్రభుత్వం చెబుతున్న లెక్కలను గారడీలుగా ప్రకటించేసారు. పదిహేను రోజుల క్రితం […]
రాజకీయాల్లో సీటు తెచ్చుకోవడం దగ్గర్నుంచే పోటీ మొదలవుతుదంటారు విశ్లేషకులు. ఒక సీటు మీద కన్ను ఉన్న ఆశావహులందర్నీ కాదని మనకు సీటు దక్కాలంటే అనేక రకాలైన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారనడంలో సందేహం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనదైన శైలితో రాణించిన సంగిత వెంకటరెడ్డి (చినకాపు)తో పోటీ పడి 2004లో ఆలమూరు ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న డా. బిక్కిన కృష్ణార్జున చౌదరి అదే ఒరవడిని రాజకీయ జీవితంలో నిలుపుకోలేకపోయారంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. 2004 ఎన్నికల్లో వైఎస్ […]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల సందడి నడుస్తోంది. దాదాపు రెండేళ్ళ తరువాత ఖాళీ అవుతున్న ఈ పదవులను తగిన అర్హత ఉన్నవాళ్లకు కేటాయించేందుకు సీయం వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గవర్నర్ కోటాలో నలుగురిని ఎమ్మెల్సీలుగా ప్రకటించడం కూడా జరిగింది. దీంతో ఆశావల్లో ఉత్కంఠత పెరిగిపోతోందని చెబుతున్నారు పరిశీలకులు. అయితే స్థానిక సంస్థల కోటాకింద ఖాళీ అయిన 8 ఎమ్మెల్సీ పదవుల్లో నియామకాలకు మరికొన్నాళ్ళు ఆగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల రిజల్ట్స్ […]
రాజకీయాల్లో ప్రత్యర్ధులే మెచ్చుకునేలా వ్యవహరించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే అలా తన రాజకీయ జీవితమంతా ప్రత్యర్ధులు కూడా పెద్దాయనా.. అంటూ అప్యాయంగా పిలుచుకునే విధంగా వ్యవహారాలు సాగించిన శిరంగు కుక్కుటేశ్వరరావు కన్నుమూయడం తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. 90 సంవత్సరాల వయస్సులో వయోభారంతో ఆయన మృతి చెందారు. దాదాపు అరవయ్యేళ్ళ రాజకీయ జీవితంలో అనేక ప్రశంసలు పొందే విధంగా వ్యవహరించడం సమకాలీన రాజకీయాల్లో ఎక్కడా కన్పించదనే చెప్పాలి. ఆయనకు భార్య, […]
విస్తీర్ణం.. జనాభా పరంగానే కాకుండా ఏపీలోని తూర్పుగోదావరి అనేక ప్రత్యేకతలు ఉన్న జిల్లాగా పేరుపొందింది. వ్యవసాయ ప్రాధాన్యత జిల్లాగా ఉన్న ఇక్కడ డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ)కి ప్రత్యేక స్థానం ఉంది. డీసీసీబీ ఛైర్మన్ పీఠాన్ని రాజకీయవర్గాలు ప్రతిష్టాత్మకంగానే పరిగణిస్తుంటారు. దీని కోసం పలువురు పోటీ పడుతుంటారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీకి ఛైర్మన్‌గా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అనంత ఉదయభాస్కర్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన పదవీ కాలం పూర్తికావొస్తుండడంతో తిరిగి కొనసాగించే […]
గోదావరి డెల్టా ప్రాంతంలో సాగు భూములకు నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు సమాయత్తమయ్యారు. మంగళవారం ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఎక్కడో మహాబలేశ్వరం వద్ద నుంచి పుట్టుకువచ్చే గోదారమ్మ భద్రాచలం వద్ద శబరి నది కలయికతో అఖండగోదావరిగా రూపుమార్చుకుంటుంది. పాపికొండలు దాటిన తరువాత దాదాపు మూడు కిలోమీటర్ల వెడల్పుతో ఉగ్రరూపంతో సముద్రంవైపు పయనిస్తుంటుంది. మహోగ్రంగా తరలివచ్చే గోదావరి నీటిని ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి తూర్పు డెల్టా, […]
రాజమహేంద్రవరం ఎంపీగా, బూరుగుపూడి నియోజకవర్గం (ప్రస్తుత రాజానగరం) ఎమ్మెల్యేగా తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన చిట్టూరి రవీంద్ర ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పూర్తిసమయం తన ఆటో మొబైల్స్, ఇతర వ్యాపారాలపైనే దృష్టి సారించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రాజకీయ ప్రముఖుడు చుండ్రు శ్రీహరి, చిట్టూరి రవీంద్రలు స్వయానా తోడళ్లుల్లే. సౌమ్యుడు, నియోజకవర్గ ప్రజలతో విస్తృత సంబంధ బాంధవ్యాలను ఇప్పటిక్కూడా కొనసాగిస్తున్న రవీంద్ర రాజకీయంగా మాత్రం సైలెంట్మోడ్లోనే ఉండిపోవడం ఆయన అభిమానులను నిరాశపరుస్తుందనే చెప్పాలి. 1996లో కాంగ్రెస్ […]