iDreamPost
android-app
ios-app

ఈ సంక్రాంతికి అన్నీ ఫ్యామిలీ సినిమాలే

  • Published Jan 06, 2026 | 2:08 PM Updated Updated Jan 06, 2026 | 2:08 PM

తెలుగు రాష్ట్రల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. అలాగే ఇటు టాలీవుడ్ లో కూడా కొత్త సినిమాల హడావిడి మొదలైపోయింది. టీజర్లు , సాంగ్స్ , ట్రైలర్ లు , ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇలా హడావిడిగా ఉన్నారు అందరు. అయితే ఈసారి సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఫ్యామిలీ సినిమాలే. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే.

తెలుగు రాష్ట్రల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. అలాగే ఇటు టాలీవుడ్ లో కూడా కొత్త సినిమాల హడావిడి మొదలైపోయింది. టీజర్లు , సాంగ్స్ , ట్రైలర్ లు , ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇలా హడావిడిగా ఉన్నారు అందరు. అయితే ఈసారి సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఫ్యామిలీ సినిమాలే. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే.

  • Published Jan 06, 2026 | 2:08 PMUpdated Jan 06, 2026 | 2:08 PM
ఈ సంక్రాంతికి అన్నీ ఫ్యామిలీ సినిమాలే

తెలుగు రాష్ట్రల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. అలాగే ఇటు టాలీవుడ్ లో కూడా కొత్త సినిమాల హడావిడి మొదలైపోయింది. టీజర్లు , సాంగ్స్ , ట్రైలర్ లు , ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఇలా హడావిడిగా ఉన్నారు అందరు. అయితే ఈసారి సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే అన్నీ ఫ్యామిలీ సినిమాలే. ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే గతకొన్నేళ్ళుగా ఓ పాన్ ఇండియా సినిమాకు సెన్సార్ విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. A సర్టిఫికెట్ తీసుకోడానికి ఎంత దూరం అయినా వెళ్తున్నారు. కానీ దీని వలన ఓ సమస్య ఉంది.

ఎందుకంటే చాలావరకు మల్టీప్లేక్స్ ల్లో A సర్టిఫికెట్ సినిమాకు పద్దెమిదేళ్ళ లోపు పిల్లలను థియేటర్స్లోకి అనుమతించరు. కానీ ఈ సంక్రాంతికి అలా కాదు అన్ని సినిమాలకు అందరు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లొచ్చు. అన్నిటికి యు లేదా యు/ఏ ఈ రెండిటిలో ఎదో ఒకటి తెచ్చుకున్నాయి. రాజాసాబ్ లో హర్రర్ కామిడి ఉంది కాబట్టి యు/ఏ వచ్చేసింది. అలాగే అటు మన శంకర వరప్రసాద్ గారు , అనగనగ ఓ రాజు ఈ రెండు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఏ సో ఇక్కడ కూడా యూ వచ్చేసింది.

ఇక రవి తేజ భర్త మహాసేయులకు విజ్ఞప్తిలో కాస్త రొమాంటిక్ జోనర్ ఉంది కాబట్టి… యు/ఏ వచ్చే అవకాశం ఉంది. నారి నారి నడుమ మురారి కూడా ఫ్యామిలీ క్యాటగిరి కిందనే వస్తుంది. సో హ్యాపీగా అందరు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి ఈ సంక్రాంతి సినిమాలు. డిసెంబర్ ఎలాగూ డ్రై గానే గడిచింది కాబట్టి కొత్త ఏడాది కొత్త సినిమాలు టాలీవుడ్ కు కళ తీసుకురానున్నాయని చెప్పొచ్చు. భారీగా బరిలోకి దిగింది మాత్రం రాజాసాబ్ ఒక్కడే . పాన్ ఇండియా స్టార్ అంటే ఈ మాత్రం ఉండడం సహజం టాక్ బావుంటే కనుక నెలాఖరు వరకు తిరుగుండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.