iDreamPost
android-app
ios-app

అనగనగ ఓ రాజు నవీన్ సంగతి సరే … మరి డైరెక్టర్ !

  • Published Jan 06, 2026 | 12:10 PM Updated Updated Jan 06, 2026 | 12:10 PM

ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి నుంచి అనగనగ ఓ రాజు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను చాలా ఏళ్ళ ముందు స్టార్ట్ చేశారట. కానీ ఎందుకో ఈ సినిమా అనేక కారణాల వలన ఆగిపోయింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హిట్ కొట్టేసాడు. అనగనగ ఓ రాజు సినిమాకు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అని అనుకున్నారు కానీ అది ఆగిపోయింది.

  • Published Jan 06, 2026 | 12:10 PMUpdated Jan 06, 2026 | 12:10 PM
అనగనగ ఓ రాజు నవీన్ సంగతి సరే … మరి డైరెక్టర్ !

ఈ సంక్రాంతికి నవీన్ పోలిశెట్టి నుంచి అనగనగ ఓ రాజు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను చాలా ఏళ్ళ ముందు స్టార్ట్ చేశారట. కానీ ఎందుకో ఈ సినిమా అనేక కారణాల వలన ఆగిపోయింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో హిట్ కొట్టేసాడు. అనగనగ ఓ రాజు సినిమాకు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అని అనుకున్నారు కానీ అది ఆగిపోయింది. దీనితో నవీన్ ఈ సినిమాను పక్కనపెట్టేశారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా నవీన్ సినిమా పోస్టర్ తో అందరికి షాక్ ఇచ్చాడు. సంక్రాంతికె రిలీజ్ చేస్తూ ఇంకొక పెద్ద షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం ప్రమోషన్స్ కూడా అంతే జోరుగా చేస్తున్నాడు. ఎక్కడ చూసిన హీరో హీరోయిన్ ఏ కనిపిస్తున్నారు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోస్తున్నాడు నవీన్ . ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా దర్శకుడి దర్శనం మాత్రం ఇవ్వలేదు. అటు నవీన్ కూడా దర్శకుడు గురించి ఏమి మాట్లాడడం లేదు. అటు నిర్మాత నాగవంశీ మాత్రం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అతను కూడా క్రెడిట్ మొత్తం నవీన్ కే ఇస్తున్నాడు.

ఇంటర్వ్యూలిస్తుండగా.. అతనూ దర్శకుడి ప్రస్తావన తేవట్లేదు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం క్రెడిట్‌ నవీన్‌కే ఇస్తున్నాడు. నవీన్ సొంతంగా రైటింగ్ టీంను పెట్టుకుని అదిరిపోయే లెవెల్లో స్క్రిప్టు రెడీ చేశాడని.. సినిమాలో కామెడీ సీన్లు ఇరగదీశాడని.. క్లైమాక్స్ కూడా చాలా బాగా చేశాడని అంటున్నాడు నాగవంశీ.. సో చూడబోతుంటే ఈ సినిమాకు నవీన్ హీరో రోల్ లో ప్లే చేయడంతో పాటు ఘోస్ట్ రైటింగ్ కూడా చేసినట్టు అనిపిస్తుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయినా దర్శకుడు కనిపిస్తాడా లేదా అనేది చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.