iDreamPost
android-app
ios-app

రెబెల్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ కోసం వెయిటింగ్

  • Published Jan 06, 2026 | 10:57 AM Updated Updated Jan 06, 2026 | 10:57 AM

ఇంకో మూడు రోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగితేలుతారు. రాజాసాబ్ రాకకు సరిగ్గా ఇంకొద్ది గంటలే మిగిలి ఉంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు టీం రెడీగా ఉన్నారు. అలాగే ఇటు డార్లింగ్ అభిమానులు కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫ్యాన్స్ అదే కంగారులో ఉన్నారు.

  • Published Jan 06, 2026 | 10:57 AMUpdated Jan 06, 2026 | 10:57 AM
రెబెల్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ కోసం వెయిటింగ్

ఇంకో మూడు రోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఆనందంలో మునిగితేలుతారు. రాజాసాబ్ రాకకు సరిగ్గా ఇంకొద్ది గంటలే మిగిలి ఉంది. జనవరి 8న రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు టీం రెడీగా ఉన్నారు. అలాగే ఇటు డార్లింగ్ అభిమానులు కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫ్యాన్స్ అదే కంగారులో ఉన్నారు. గత కొన్ని సినిమాల విషయంలో కూడా ఇలా ఆఖరి వరకు ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పలేదు. కానీ ఫైనల్ గా మాత్రం ప్రీమియర్ పడకుండా ఉండదు. సో ఆ గుడ్ న్యూస్ కోసమే అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఏపీలో అయితే ఎలాంటి సమస్య లేదు . ఇప్పటివరకు చాలానే సినిమాలకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి రాజాసాబ్ కు కూడా ఇచ్చే తీరుతారనే నమ్మకం అందరికి ఉంది. సో టీం అంతా అలా లాస్ట్ మినిట్ టెన్షన్ లో ఉండగా. రాజాసాబ్ ఆ టెన్షన్ నుంచి అందరిని బయటకు తీసుకురాడానికి ఓ కూల్ సాంగ్ తో వచ్చేసాడు. ముగ్గురు భామలతో డార్లింగ్ వేసిన స్టెప్పులు కంప్లీట్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసేసారు. దీనితో ఈ సాంగ్ ను బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ఓపెనింగ్స్ లో అయితే ఎలాంటి డోకా లేదు. కచ్చితంగా సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యేవరకు రాజసాబ్ థియేటర్స్ ముందు హౌస్ ఫుల్ బోర్డు లు ఖాయం . కానీ ఇక్కడ టాక్ మారిపోకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం ఇంపార్టెంట్. ఇలా కనుక అనిపించుకుంటే ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఈ సినిమాకు తిరుగు ఉండదు. ఇక ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు రాజాసాబ్ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.