ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గత కొద్దికాలంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్రంగా సొంత రాష్ట్రమైన ఏపీని వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చకు తెరలేపుతోంది. ఇదే సమయంలో తాజాగా ఆయనపై సిరిసిల్లా జిల్లా పర్యటన సమయంలో దాడి జరగడం కలకలంగా మారింది. అయితే దీనిపై స్పందించిన కేఏ పాల్ టీఆర్ఎస్ పార్టీ యువనేత మంత్రి కేటీఆర్ మనుషులు తనపై దాడి చేశారని కేఏ […]
కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు. చైనా, అమెరికాలో కేసులు ఉన్నా.. ఇండియాలో ఇప్పటివరకు అయితే ఓకే.. అందుకు కారణం అందరూ టీకా తీసుకోవడమే. దాదాపు అందరూ రెండు డోసులు.. కొందరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. క్రమ క్రమంగా పిల్లలకు కూడా టీకా వేస్తున్నారు. దానికి సంబంధించి నిర్దేశిత సమయంలో వయస్సును నిర్ణయించి మరీ వేస్తున్నారు. చిన్నారుల టీకా విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలో గల చిన్నారుల కోసం కోవోవాక్స్ వాక్సిన్ సిద్ధంగా […]
తమిళనాడు యువ హీరో.. సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ కు త్వరలోనే ప్రమోషన్ లభించబోతోంది. తమిళనాడులో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఉదయనిధి కృషి చేశారు. పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా ఎనలేని సేవలు చేశారు. యువతను డీఎంకే వైపు మళ్లించడంలో కృషి చేశారు. ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్ ను క్యాబినెట్ లోకి తీసుకురావడానికి సీఎం స్టాలిన్ కసరత్తు చేస్తున్నట్టు డీఎంకే వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వార్తలు లీక్ అవుతున్నాయి. […]
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. ప్రముఖ సువార్తికుడు కేఏ పాల్ చెంప చెళ్లుమనిపించారు. పోలీసులున్న సమయంలోనే ఆయనపై దాడి జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కేఏ పాల్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు మార్గంమధ్యలో అడ్డుకున్నారు. సిద్ధిపేట జక్కాపూర్ వద్ద కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. స్తానిక […]
తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన రాజకీయ శక్తులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇక ఇవికాకుండా అరడజను చిన్నాచితకా పార్టీలు ఉన్నాయి. ఏఐఎంఐఎం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ,తెలంగాణ జన సమితి మరియు మహా జన సమితిలు తెలంగాణలో ఇతర పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి […]
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్‌స్టేషన్‌లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం. హతుడు గంజి ప్రసాద్‌కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే […]
వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఆయన భౌతికకాయాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రశేఖరరాజు 1989 నుంచి 1994 […]
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మరోసారి ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు అక్కడే పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలోని అతి పెద్ద నగరాలైన షాంఘై,బీజింగ్ లలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రెండు నగరాలే కీలకం. కానీ ప్రస్తుతం ఆ నగరాల్లో రోజుకు 15 వేల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయం గుర్తించిన చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు నగరాల్లో లాక్ […]
దేశంలో కరెంట్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ఆఖరుకు రైల్వేలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. కరెంట్ కోతల వల్ల 657 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. ఇది షాకింగ్ గా మారింది. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో కరెంట్ వాడకం బాగా పెరిగిపోయింది. సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది […]
గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత ఈ రోజు ఉదయం 7 గంటలకు హత్యకు గురయ్యారు. కాగా, పరామర్శకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించింది. జి. కొత్తపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడిచేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చేరుకోగా, ప్రత్యర్థివర్గం ఎమ్మెల్యేపై […]