మే 3, 1913 న దాదాసాహెబ్ ఫాల్కే దర్శక, నిర్మాణంలో విడుదల అయిన తర్వాత చాలా సంవత్సరాలపాటు మౌనంగా అభిమానులను అలరించిన భారతీయ సినిమా మార్చి 14,1931 న విడుదల అయిన ఆలంఆరా సినిమాతో మాట్లాడి, పాట పాడడం మొదలుపెట్టింది. అర్దేశిర్ ఇరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించి, నిర్మించాడు. అంతకు నాలుగేళ్ల క్రితం అక్టోబర్ 6,1927న అమెరికాలో మొట్టమొదటి టాకీ సినిమా “ది జాజ్ సింగర్” విడుదల అయినప్పుడే మొదటి భారతీయ టాకీ సినిమాకు అర్దేశిర్ […]
సౌరకుటుంబంలో అన్ని గ్రహాలమీద జరిగే ఉల్కాపాతం వలన ఆయా గ్రహాల ఉపరితలం మీద వివిధ పరిమాణంలో బిలాలు ఏర్పడతాయి. వాటిలో పెద్దవిగా ఉండే బిలాలకు పేర్లు పెట్టడం కోసం అంతర్జాతీయ అంతరిక్ష సంఘం ఒక శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. గ్రహాలలో ఒక్క వీనస్ తప్ప మిగిలిన అన్నీ పురుషుల పేర్లతో ఉన్నాయి కాబట్టి ఆడ పేరు ఉన్న ఏకైక గ్రహం మీద ఉన్న బిలాలకు ఆడ పేర్లు పెట్టారు. వీనస్ గ్రహం మీద దట్టమైన వాతావరణం […]
ఎక్కడో ఉక్రెయిన్ మీద రష్యా దాడిచేస్తే మన వీధి చివర ఉన్న షాపులో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. యుద్ధంవల్ల సరుకుల రవాణా ఛార్జీలు పెరిగి, ధరలు పెరిగాయి అనుకోవడానికి లేదు. ఆ వస్తువులు యుద్ధం మొదలవడానికి చాలారోజుల ముందు షాపుకి వచ్చి ఉంటాయి. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం వల్ల ఇలా జరుగుతుంది. వ్యాపారుల ఇలాంటి అత్యాశ వలన 283 సంవత్సరాల క్రితం ఢిల్లీ నగరం కనీవినీ ఎరుగని విధ్వంసానికి, దోపిడికి గురయి, నగర వీధుల్లో రక్తం […]
ఫిబ్రవరి 13, 1847న ఉత్తర భారతదేశంలోని అవధ్ సంస్థానానికి పదవ పాలకుడుగా పట్టాభిషేకం జరుపుకున్న వాజిద్ ఆలీ షా పదవ వార్షికోత్సవం జరుపుకోకుండానే తన పీఠం కోల్పోవాల్సి వస్తుందని ఊహించి ఉండడు. ఆనాటి ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సామ్రాజ్య విస్తరణ కాంక్షకు అవధ్ సంస్థానం బలి అయిపోయింది. ఈస్టిండియా కంపెనీ రాజ్యకాంక్ష.. వ్యాపారం కోసం 1600 సంవత్సరంలో ఏర్పడిన ఈస్టిండియా కంపెనీ భారతదేశంలో మొదట్లో తమ గోడౌన్లకు కాపలా కోసం ఏర్పరచుకున్న తమ […]
ఫిబ్రవరి 10,1952 భారత క్రికెట్ చరిత్రలో మరపురాని రోజు. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు తన మొదటి టెస్టు విజయాన్ని నమోదు చేసిన రోజు అది. భారత జట్టు తన మొదటి టెస్టు మ్యాచ్ 1932లో ఇంగ్లాండులో ఆ జట్టు మీద ఆడి, టెస్టు హోదా పొందిన ఆరవ దేశంగా గుర్తింపు పొందినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. భారత క్రికెట్ జట్టుకు టెస్టు హోదా పొందే సత్తా లేకపోయినా తన పాలనలో ఉన్న […]
యాభై సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 6 1971 న చంద్రుడు ఉపరితలం మీద అమెరికా దేశపు అపోలో-14 మిషన్ లో భాగంగా దిగిన అలాన్ షెపర్డ్ అనే వ్యోమగామి తమ మిషన్ లో భాగంగా చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాక తన వెంట తెచ్చుకున్న రెండు గోల్ఫ్ బంతులను, చంద్రుడి మీద మట్టిని శాంపిల్ తీసే పరికరానికి అతికించిన గోల్ఫ్ క్లబ్ తాలూకూ హెడ్ ఉపయోగించి రెండు షాట్ లు కొట్టాడు. చంద్రుడు మీద గురుత్వాకర్షణ శక్తి భూమితో […]
ఈ ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్లో ఆరవ సీడ్ రాఫేల్ నాడాల్ తన కన్నా చిన్నవాడు, మంచి ఫామ్ లో ఉన్న రెండవ సీడ్ రష్యా క్రీడాకారుడు డానిల్ మెద్వెదేవ్ మీద 5 గంటలా 24 నిమిషాలు జరిగిన అయిదు సెట్ల మ్యాచ్ లో గెలిచి, 21 వ గ్రాండ్ స్లామ్ గెలిచిన మొదటి క్రీడాకారుడిగా ప్రపంచరికార్డు సాధించాడు. ఆ వేదిక మీద నాడాల్ సాధించిన రెండో టైటిల్ ఇది. […]
కర్ణాటక రైతును “నువ్వు ఈ కారు కొనలేవులే” అని ఒక బెంగుళూరు కార్ల షోరూంలోని సేల్స్ ఎగ్జిక్యూటివ్ అవమానించిన సంఘటన దాదాపు ఒక శతాబ్దం క్రితం లండన్ లో లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ షోరూంలో నాటి ఆళ్వార్ సంస్థానాధీశుడు ఎదుర్కొన్నారు. డబ్బులు మొహాన కొట్టి కారు కొన్న కర్ణాటక రైతులాగా, అంతకు మించిన ప్రతీకారం ఆ కంపెనీ మీద తీర్చుకున్నాడు ఆళ్వార్ మహరాజా. నాటి రాజులకు ఇష్టమైన కారు 1909లో ఉత్పత్తి ప్రారంభించిన ఇంగ్లాండుకి […]
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా పర్యటనలో మొదటి టెస్టు గెలిచిన కోహ్లీసేన ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఏ జట్టు సాధించలేని టెస్టు సిరీస్ విజయం సాధించగలదని అభిమానులు ఆశ పడ్డారు. అయితే, ఆ తర్వాత రెండు టెస్టులు దక్షిణాఫ్రికా గెలుచుకోవడంతో దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ మరోసారి భారత జట్టుకు అందకుండా పోయింది. విదేశీ గడ్డ మీద కష్టాలు ఏ క్రికెట్ జట్టుకైనా విదేశీ పర్యటనలో విజయం సాధించడం సొంతగడ్డ మీద గెలవడం కన్నా మంచి పేరు తెచ్చి పెడుతుంది. […]
జనవరి 13,1842 న ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ నగరంలో ఉన్న బ్రిటిష్ సైనిక స్థావరం బయట కాపలా ఉన్న సెంట్రీకి దూరంగా నడవలేక నడుస్తున్న ఒక గుర్రం, దానిమీద వాలిపోయి బ్రతికి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో ఉన్న ఒక మనిషి కనిపించారు. వెంటనే కొందరు సైనికులు వెళ్ళి ఆ ఇద్దరినీ తీసుకొచ్చారు. తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఇచ్చాక ఆ వ్యక్తి కోలుకోలేని తన పేరు విలియమ్ బ్రైడన్ అని, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బ్రిటిష్ […]