శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నేడే(జూన్ 23) జరగనుంది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గానికి నేడు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆల్రెడీ ఇవాళ ఉదయం ఉదయం 7గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల […]
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటు చేసేందుకు తీవ్ర కృషి చేస్తోంది సర్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచన చేశారు. ఆ మార్గాన్ని మరింత సుగమం చేస్తూ, వచ్చే సంవత్సరం నుంచి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, ఏలూరు జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చేందుకు ప్రణాళికలు మొదలయ్యాయి. ఒక్కో దానికి రూ.5 కోట్లతో నిర్మాణ పునులు సైతం చేపడుతోంది ప్రభుత్వం. ఇలా ప్రతి కాలేజీలో 150 […]
‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు వేశారు . అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని ఎమ్మెల్సీ అనంతబాబు తమకు వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబును ఇప్పటికే పోలీసులు […]
వైఎస్సార్సీపీ దూకుడు పెంచింది. ఎన్నడూలేని విధంగా అమలుచేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీకి దిశానిర్దేశం చేశారు. విభజనకు ముందు, ఆ తర్వాత టీడీపీ హయాంలో సామాజిక అన్యాయం ఎలా జరిగింది? మూడేళ్లుగా ప్రభుత్వం ఆచరిస్తున్న సామాజిక న్యాయాన్ని జనం ముందుకుతీసుకెళ్లేలా ఈనెల 26 నుంచి 29 వరకూ బస్సు యాత్రను చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు యాత్ర బస్సు యాత్ర […]
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో వెల్లడించారు. విజయసాయిరెడ్డి, నిరంజన్రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. ముందుగా ఈ నలుగురు సీఎం జగన్తో భేటీ అయ్యారు. అందరితో సంప్రదించిన తర్వాతే ఈ నలుగురి పేర్లను సీఎం జగన్ ఖరారు చేశారని చెప్పారు. విజయసాయిరెడ్డికి మరోసారి రాజ్యసభ అవకాశం దక్కింది. జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ […]
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తన పార్టీ కార్యకర్తలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు ఉద్యోగమేళాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్యనేత, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి వివరాలు వెల్లడించారు. ఎవరు విమర్శలు చేసినా ఫర్వాలేదని, వైసీపీ కార్యకర్తలకు 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. […]
రాజకీయం అంటేనే వ్యూహం, ఎత్తుగడలు. ప్రత్యర్థులకు అందకుండా, ప్రత్యర్థుల అంచనాలకు దొరక్కుండా వ్యూహం రచించడం, దాన్ని అమలుచేయడం రాజనీతి. ఆ వ్యూహాలు సవ్యమైనవి కావొచ్చు, అపసవ్యమైనవి కూడా కావొచ్చు. యుద్ధంలో ఏదైనా సమర్ధనీయమే. రాజకీయాల్లో కూడా అంతే. తాను అధికారంలో ఉండేందుకు, అధికారం కాపాడుకునేందుకు, అధికారంలో ఉన్నవారిని దించేందుకు ఎలాంటి వ్యూహం, ఎత్తుగడ అయినా సమర్ధనీయమే. అయితే ఆ వ్యూహాల్లో కొంత న్యాయం, నిబద్దత ఉండాలి. ప్రత్యర్థి నిద్రపోతున్నప్పుడు దాడి చేయకూడదు. అలాగే ప్రత్యర్థి నిరాయుధుడు అయినప్పుడు దాడి చేయకూడదు. ఇది రాజనీతి. కానీ […]