Arjun Suravaram
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే ఆసక్తి అందరిలో ఉంది.
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషయంలో ఏర్పడిన ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే ఆసక్తి అందరిలో ఉంది.
Arjun Suravaram
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ హీట్ పీక్ స్టేజికి చేరుకుంది. అలానే అనేక ఆసక్తికర పరిణామాలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీలోకి చేరికలు భారీగా పెరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు వైసీపీ కడువాను కప్పుకుంటున్నారు. ఇటీవలే కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ సీపీలో చేరారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం వైఎస్సార్ సీపీలో చేరారు. కొన్ని రోజుల క్రితమే ఆయన వైఎస్సార్ సీపీలోకి చేరుతారని స్పష్టమైంది. గురువారం వైసీపీలో చేరాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ్డ పద్మనాభం పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని తెలిపారు.
ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ ప్రస్థానం గురించి చూసిటనట్లు అయితే.. ఆయన 1978లో జనతా పార్టీలో తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో ముద్రగడ చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ స్థానంలో గెలిచారు. అలానే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ ఆయన పని చేశారు.
ఇటీవల జరిగిన రాజకీయ పరిణమాలు ముద్రగడ చుట్టూనే తిరిగాయి. ఆయన తొలుత జనసేనలో చేరుతారని వార్తలు వినిపించాయి. అయితే పవన్ కల్యాణ్ తీరుపై ముద్రగడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జనసేనలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అలానే తనను మొదటి నుంచి అభిమానిస్తున్నా, తనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్సార్ సీపీలో చేరేందుకే ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే తాను వైఎస్సార్ సీపీలో చేరుతాని కొన్ని రోజుల క్రితమే ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకునేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ బాధ్యతలు ఇస్తే.. అవి నిర్వర్తిస్తామని ముద్రగడ తెలిపారు. ఈనెల 14వ తేదీనే వైఎస్సార్ సీపీలో చేరాల్సి ఉండగా.. వివిధ కారణాలతో వాయిదా పడింది. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించిన ముద్రగడ చివరకు వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారు.