iDreamPost
android-app
ios-app

అనంతపురంలో TDPలోకి భారీ షాక్.. కీలక నేత రాజీనామా

  • Published Apr 01, 2024 | 7:48 AM Updated Updated Apr 01, 2024 | 7:48 AM

Attar Chand Basha: ఎన్నికల వేళ అనంతపురంలో TDPలోకి భారీ షాక్.. కీలక నేత సైకిల్ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు..

Attar Chand Basha: ఎన్నికల వేళ అనంతపురంలో TDPలోకి భారీ షాక్.. కీలక నేత సైకిల్ పార్టీకి రాజీనామా చేసి.. వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు..

  • Published Apr 01, 2024 | 7:48 AMUpdated Apr 01, 2024 | 7:48 AM
అనంతపురంలో TDPలోకి భారీ షాక్.. కీలక నేత రాజీనామా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించడం కోసం జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక సీట్ల కేటాయింపు తర్వాత అసంతృప్తులు బయటపడుతున్నారు. చాలా మంది సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపారు. దాంతో వారంతా పక్క పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అనంతపురంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, కీలక నేత ఒకరు సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పి.. అధికార వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు..

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చాంద్ బాషా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అయిన అత్తార్ చాంద్ బాషా.. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం చాంద్ బాషాకు మొండి చేయి చూపింది. మరో అభ్యర్థి వెంకటప్రసాద్ టికెట్ కేటాయించడంతో.. అసంతృప్తితో ఉన్న చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు

అయితే చాంద్ బాషా గతంలో అనగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ మారిన చాంద్ బాషా.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లోనూ చాంద్ బాషా టీడీపీ టికెట్ ఆశించగా.. చంద్రబాబు మాత్రం కందికుంటకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2024 ఎన్నికల్లో అయినా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తారనుకుంటే.. అధినేత మాత్రం మరోసారి అనుకుంటే కందికుంట వైపే మొగ్గుచూపటంతో చాంద్ బాషా టీడీపీకి రాజీనామా చేశారు. కదిరి నియోజకవర్గంలో మైనారిటీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. దాంతో ఇక్కడ వైసీపీ మైనారిటీ అభ్యర్థిని బరిలో నిలుపుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీ అయిన తనకు టీడీపీ టికెట్ కేటాయిస్తుందని చాంద్ బాషా భావించగా.. నిరాశే మిగిలింది.

అయితే 2014 తర్వాత వైసీపీ నుంచి తెలుగు దేశంలోకి వచ్చిన సమయంలో.. తనకు మంత్రి పదవితో పాటుగా తగిన గుర్తింపు ఇస్తామని చంద్రబాబు మాట ఇచ్చినట్లు చాంద్ బాషా గుర్తు చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అధినేత మాట తప్పారని.. కదిరిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు, బహిరంగ సభ గురించి కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేగా తొలిసారిగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానన్న ఆయన.. కదిరిలో సోమవారం జగన్ సమక్షంలో తిరిగి వైసీసీలో చేరనున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş