Dharani
Actor Ramachandra Raju: జగన్ పాలనను పొగుడుతూ.. వైసీపీకి మద్దతిచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వీరిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. మొన్న విశాల్.. ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి కేజీఎఫ్ నటుడు చేరారు. ఆ వివరాలు..
Actor Ramachandra Raju: జగన్ పాలనను పొగుడుతూ.. వైసీపీకి మద్దతిచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. వీరిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. మొన్న విశాల్.. ఏపీ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి కేజీఎఫ్ నటుడు చేరారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన, ప్రభుత్వ పథకాలపై దేశ, విదేశాల ప్రతినిధులతో పాటు.. మన దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యులు, సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్య, వైద్యం రంగాల్లో జగన్ చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శం అని పొగుడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి నడుం కట్టిన సీఎం జగన్.. వాటి రూపరేఖలు మార్చడంతో పాటు.. విద్యను ప్రోత్సాహించడం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి.. ప్రభుత్వ పాఠశాల విద్య దశను మార్చేశారు.
అంతేకాక ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టడంతో.. నేడు ఏపీలో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలానే వైద్య రంగంలో కూడా అనేక సంస్కరణలు చేప్టటారు సీఎం జగన్. మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి.. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో జగన్ కూడా ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన మార్పులను గమనించమని జనాలకు సూచిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ పలువురు సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతిస్తూ.. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హీరో విశాల్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాక మరోసారి అధికారంలోకి రాబోయేది వైసీపీనే అని అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. జగన్ పాలన అద్భుతం.. వైసీపీకే నా మద్దతు అన్నారు ‘కేజీఎఫ్’ నటుడు రామచంద్రరాజు. ఆ వివరాలు..
కన్నడ స్టార్ హీరో యశ్ దగ్గర పనిచేసిన రామచంద్రరాజు.. ‘కేజీఎఫ్’ సినిమాలో గరుడ అనే విలన్ పాత్రతో నటుడిగా మారాడు. ఆ సినిమాలో ఆయన పండించిన విలనీజం చూసి ప్రేక్షకులు భయపడ్డారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. కేజీఎఫ్ సాధించిన విజయంతో.. అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. ఇక తెలుగులో కూడా ఆయన పలు చిత్రాల్లో నటించారు.
ఈ క్రమంలో తాజాగా రామచంద్రరాజు.. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. రైల్వే కోడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను ఆయన ఇక్కడకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రరాజు మాట్లాడుతూ.. కోరముట్ల శ్రీనివాసులు.. తనకు అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. అలానే వైసీపీ పాలన అద్భుతం అని నటుడు ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా రామచంద్రరాజు మాట్లాడుతూ.. ‘‘నామినేషన్‌కి ఇంతమంది జనాలు వస్తారని నేను ఊహించలేదు. దాదాపు 20-30 వేల మెజరిటీతో నా స్నేహితుడు ఎన్నికల్లో గెలుస్తాడని అనిపిస్తుంది. జగన్ పాలన చూస్తే నాకు ముచ్చటేస్తోంది. వైసీపీకే నా మద్ధతు. విద్య, వైద్య రంగాల్లో జగన్ చాలా అభివృద్ధి చేశారు. నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆయనకు నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను’’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా రానున్న ఎన్నికల్లో జగనే విజయం సాధిస్తారని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.