iDreamPost
android-app
ios-app

AP Land Titling Act: ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఎందుకు అవసరం? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? పూర్తి వివరాలు!

  • Published May 02, 2024 | 1:31 PM Updated Updated May 02, 2024 | 1:34 PM

AP Land Titling Act: ఏపీలో ఎన్నికల ప్రచారం మొత్తం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చుట్టూ సాగుతోంది. భూములు పోతాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. అలా కాదు, ఈ చట్టంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి పూర్తిగా తెలుసుకుందాం..

AP Land Titling Act: ఏపీలో ఎన్నికల ప్రచారం మొత్తం.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చుట్టూ సాగుతోంది. భూములు పోతాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. అలా కాదు, ఈ చట్టంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published May 02, 2024 | 1:31 PMUpdated May 02, 2024 | 1:34 PM
AP Land Titling Act: ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ఎందుకు అవసరం? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. అన్ని పార్టీలో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ చట్టం వస్తే భూములు పోతాయని తీవ్ర స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వం మాత్రం ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో భూ యజమానులకు మరింత కచ్చితమైన భరోసా వస్తుందని చెబుతోంది. అసలింతకీ.. ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2023 అంటే ఏమిటి? ఈ చట్టం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు అవసరం? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆంధ్రప్రదేశ్‌లో చాలా భూమి ఉంది. అందులో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాలు భూములు ఉన్నాయి. అయితే.. వాటికి సంబంధించి.. 30కి పైగా రికార్డులు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో బ్రిటీష్‌ కాలానికి సంబంధించిన రికార్డులు. గ్రామాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటే.. 90 శాతం మంది ప్రజలు వాటిని స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఎందుకంటే.. భూ వివాద కేసులపై కోర్టుకు వెళ్తే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందని భయం. ఆ లోపు ఆ భూమి ఎవరికీ హక్కు లేకుండా ఉన్న ఆస్థులు అమ్ముకోవాల్సి వస్తుందని సాధారణంగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలా కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు ప్రధాన కారణం సరైనా రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండటం.

ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు భూమి చుట్టూ ఉంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి.. ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి, వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశం. అలాగే అసలు రాష్ట్రంలో ఎంత భూమి సాగులో ఉంది, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్నా.. వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి తలనొప్పి ఉండదు. ఎవరు పడితే వారు, ఇది నా భూమి అని యాజమానులపై కేసులు వేసే అవకాశం అస్సలు ఉండదు.

భూముల లెక్కలు తేల్చిన తర్వాత.. ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి.. వివాదాల్లో ఉన్న భూమి వివరాలును ఓ ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2023. ఈ ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అవుతుంది. భవిష్యత్తులో అధికార బలంతో, రాజకీయ నాయకుల అండతో ఎవరూ కూడా భూమిని కబ్జా చేసే అవకాశం కానీ, భూమి తమదే అని కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.

ప్రస్తుతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండటంతో ఒక పైలెట్‌ ప్రాజెక్ట్‌ కావడంతో భూమి వివరాలు నమోదు చేసిన తర్వాత.. ఒరిజినల్‌ పట్టా కాకుండా.. జిరాక్స్‌ పత్రాలు ఇస్తున్నారు. అయితే.. ఇలా టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు అయిన భూమిపై.. రెండేళ్ల వ్యవధిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం భూమి ఎవరి పేరున అయితే ఉందో.. వారు తమ పేర్లను ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రకారం.. నమోదు చేయించుకుంటే.. భవిష్యత్తులో వారికి ఎలాంటి చిక్కులు కూడా ఉండవు. అలాగే భుమిపై ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టినా.. అవి సక్రమంగా అర్హలకు మాత్రమే అందే అవకాశం ఉంది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş