iDreamPost
android-app
ios-app

గీతాంజలి కుటుంబానికి అండ.. పిల్లల పేరిట రూ.20 లక్షల FD

  • Published May 11, 2024 | 10:13 AM Updated Updated May 11, 2024 | 10:13 AM

టీడీపీ సోషల్‌ మీడియా పైశాచిక ఆనందానికి గీతాంజలి అనే అమాయకురాలు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్‌ ఆమె పిల్లలకు ఆర్థిక సాయం చేయగా.. వైసీసీ ఎన్నారై విభాగం ఆమె పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

టీడీపీ సోషల్‌ మీడియా పైశాచిక ఆనందానికి గీతాంజలి అనే అమాయకురాలు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జగన్‌ ఆమె పిల్లలకు ఆర్థిక సాయం చేయగా.. వైసీసీ ఎన్నారై విభాగం ఆమె పిల్లలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published May 11, 2024 | 10:13 AMUpdated May 11, 2024 | 10:13 AM
గీతాంజలి కుటుంబానికి అండ.. పిల్లల పేరిట రూ.20 లక్షల FD

గీతాంజలి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆమెని అంత త్వరగా మర్చిపోలేరు. ఎంతో అమాయకమైన రూపం.. చెరగని చిరునవ్వు. కానీ సోషల్‌ మీడియా రాక్షసులు, పచ్చ మూక కారణంగా ఆ చిరునవ్వు మూగబోయింది. ఆ అమాయకమైన రూపం కనుమరుగయ్యింది. నవరత్నాల పథకాల ద్వారా.. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. పేదలందరి సొంతింటి కలను సాకారం చేశారు. ఇక జగన్‌ ప్రభుత్వం వల్ల కలిగిన మేలు గురించి ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చింది గీతాంజలి. జగన్‌ ప్రభుత్వం వల్ల తనకు కలిగిన మేలు గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా రాదు.

ఇక గీతాంజలి మాట్లాడిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. ఆమె కళ్లల్లో సంతోషాన్ని.. జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆమె చెప్పిన మాటల్ని పచ్చ మూక జీర్ణించుకోలేకపోయింది. సోషల్‌ మీడియా వేదికగా అత్యంత దారుణంగా ఆమెని వేధింపులకు గురి చేసింది. వాటిని తట్టుకోలేకపోయినా ఆ అమాయకురాలు.. ఇద్దరు బిడ్డల గురించి కూడా ఆలోచికుండా ప్రాణాలు తీసుకుంది.

ఇక గీతాంజలి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపడమే కాక.. ఆమె పిల్లల పేరు మీద ఇప్పటికే 20 లక్షలు ఆర్థిక సాయం బ్యాంకులో జమ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం గీతాంజలి పిల్లలకు భారీ ఆర్థిక సాయం చేసింది. వైసీపీ ఎన్‌ఆర్‌ఐ యూకే విభాగం అండగా నిలిచింది. ఆమె ఇద్దరు పిల్లలు రిషిత(10), రుషిక(6) పేర్లతో రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలను బ్యాంక్‌లో ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసింది. డిపాజిట్‌ పత్రాలను శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా గీతాంజలి భర్త గొల్తి బాలచందర్, కుమార్తెలు రిషిత, రుషికకు అందజేశారు.

పిల్లలను బాగా చదివించాలని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా వైఎస్సార్‌ సీపీని సంప్రదించాలని ఈ సందర్భంగా బాలచందర్‌కు సజ్జల సూచించారు. బాలచందర్‌ మాట్లాడుతూ గీతాంజలి చనిపోయిన కొన్ని గంటల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించి తమ కుటుంబానికి భరోసా కల్పించారని.. జీవితం మీద నమ్మకం కలిపించారని తెలిపారు. ‘వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ యూకే విభాగం కన్వీనర్లు డాక్టర్‌ ప్రదీప్‌ చింతా, ఓబుల్‌రెడ్డి ఆధ్వర్యాన ఎ.సురేంద్రరెడ్డి, యూకేలోని వైఎస్సార్‌సీపీ విభాగం సభ్యులు అందరూ కలిసి మా పిల్లల పేరు మీద రూ.20 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి పత్రాలు అందజేశారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చల్లా మధు, ఎన్‌ఆర్‌ఐ కాశీపతి పాల్గొన్నారు.