iDreamPost
android-app
ios-app

AP Elections 2024: YCPలో ధీమా.. ఓటర్లు అక్కడ జగన్ నెత్తిన పాలు పోశారు!

  • Published May 14, 2024 | 2:22 PM Updated Updated May 14, 2024 | 10:02 PM

ఏపీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఓటరు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో భద్రపరిచాడు. ఇక ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే జూన్‌ 4 వరకు ఆగాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. ఓటర్లు జగన్‌ నెత్తిన పాలు పోశారని కొన్ని మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఆ వివరాలు..

ఏపీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఓటరు తమ అభిప్రాయాన్ని ఈవీఎంలలో భద్రపరిచాడు. ఇక ఈ ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే జూన్‌ 4 వరకు ఆగాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం.. ఓటర్లు జగన్‌ నెత్తిన పాలు పోశారని కొన్ని మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published May 14, 2024 | 2:22 PMUpdated May 14, 2024 | 10:02 PM
AP Elections 2024: YCPలో ధీమా.. ఓటర్లు అక్కడ జగన్ నెత్తిన పాలు పోశారు!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగ్గా.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. ఈసారి ఎన్నికల్లో ఓటేసేందుకు జనాలు.. ఉత్సాహం చూపారు. దాంతో కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్‌ కొనసాగింది. అర్థరాత్రి వరకు కూడా క్యూలైన్లలో నిల్చుని.. ఓటేశారు జనాలు. దాంతో గతంలో కన్నా ఈసారి అధికంగా పోలింగ్‌ నమోదయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 80.4 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈ సారి అది ఒక శాతం పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ని వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సరళి చూస్తే.. ఫలితాలు క్లియర్‌ కట్‌గా అర్థం అవుతున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికలు లబ్ధిదారులకు, పెత్తందార్లకు మధ్య జరిగినట్లుగా వారు అభిప్రాయపడుతున్నారు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. మొదటి రోజు నుంచే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ.. ప్రజలకు సంక్షేమ పాలన అందించాడు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించిన జగన్‌.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేశారు. 59 నెలల పాలనలో 98 శాతం హామీలను అమలు చేసి.. మాట మీద నిలబడే నాయకుడిగా ప్రజల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నాడు.

ఇక జగన్‌ పాలనలో ఏపీలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయి. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, చిన్నాచితక కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వం నుంచి ఏదో ఒక లబ్ధి చేకూరింది. వారంతా జగన్‌ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు ఇలానే అమలు కావాలంటే.. మళ్లీ జగన్‌ రావాల్సిందే అని వాళ్లు బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకే తమ ఓటేసి జగన్‌ పట్ల విశ్వాసం చాటుకున్నారని.. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు, మహిళలు, వృద్ధులు, వికలాంగాలు ఇలా అన్ని వర్గాల వారు జగన్‌కే తమ ఓటే వేశారని కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వీరంతా వైసీపీకే తమ ఓటు వేసి.. జగన్‌ నెత్తిన పాలు పోశారని.. కూటమి ఆరోపణలు, ప్రచారాన్ని తిప్పి కొట్టారని అంటున్నారు. ఈ ఓటింగ్‌ సరళిని చూస్తే.. ఏపీలో మళ్లీ గెలిచేది జగనే అని కొన్ని మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఇక అసలు ఫలితాలు రావాలంటే.. మరో మూడు వారాలు ఎదురు చూడాలి. జూన్‌ 4న కౌంటింగ్‌ నాడు.. దీనిపై స్పష్టత రానుంది.