iDreamPost
android-app
ios-app

YSRCPలో తీవ్ర విషాదం.. మాజీ MLA మృతి.. 23 ఏళ్లుగా ప్రజా సేవలో

  • Published May 22, 2024 | 10:36 AM Updated Updated May 22, 2024 | 10:36 AM

వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 ఏళ్లుగా ప్రజా సేవ అందించిన మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..

వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 23 ఏళ్లుగా ప్రజా సేవ అందించిన మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..

  • Published May 22, 2024 | 10:36 AMUpdated May 22, 2024 | 10:36 AM
YSRCPలో తీవ్ర విషాదం.. మాజీ MLA మృతి.. 23 ఏళ్లుగా ప్రజా సేవలో

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఇంకా తగ్గలేదు. మే 13న పోలింగ్‌ జరిగింది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ముఖ్య నేతలంతా వెకేషన్‌లో ఉన్నారు. ఇక పోలింగ్‌ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనిపై సిట్‌ విచారణ జరుపుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) కన్నుమూశారు. ఆ వివరాలు..

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృ‍ష్ణారావు.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. 23 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు. 2012లో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన.. 2014, 2019 ఎన్నికల్లో ప్రచారం వరకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. కృష్ణబాబు వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే..

కృష్ణబాబు.. ది ఆంధ్రా షుగర్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణరంగారావు, అచ్చాయమ్మ దంపతుల మూడో సంతానం. కృష్ణబాబుకు ఇద్దరు కుమారులు వెంకట్రాయుడు, రవిబాబుతో పాటుగా కుమార్తె అర్చన ఉన్నారు. ఇద్దరు కుమారులు వ్యాపారంగంలో ఉండగా.. కుమార్తె అర్చన గృహిణి, అల్లుడు ఎస్‌.రాజీవ్‌కృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. ఇక కృష‍్ణబాబు భార్య నాగమణి కొన్నేళ్ల క్రితమే మరణించగా.. అప్పటినుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. కృష్ణబాబు మృతి నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి కొవ్వూరు మండలం దొమ్మేరుకు తరలించారు.. ఇవాళ మధ్యాహ్నం దొమ్మేరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాజకీయ జీవితం..

ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా రాజకీయాల్లో కృష్ణబాబు తనదైన ముద్రను వేశారు. రాజకీయాలతో పాటుగా పారిశ్రామిక వేత్తగా కూడా రాణించారు. ఆయన ఆంధ్రా ఫారం కెమికల్స్‌ కర్మాగారానికి జేఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ పిలుపుతో కృష్ణబాబు తెలుగు దేశం పార్టీ ద్వారా 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 1983, 1985, 1989, 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 1999లో ఓడిపోగా.. దాదాపుగా 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 2012లో వైసీపీలో చేరారు. వయసు పైబడటంతో.. ప్రచారానికే పరిమితం అయ్యారు. ఇక కృష్ణబాబు మృతి ఏపీ రాజకీయ నాయకులు, వైసీపీ శ్రేణులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.