Dharani
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అన్నారు. ఆ వివరాలు..
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అన్నారు. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అధికార, విపక్ష పార్టీలన్ని ఎలక్షన్ క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇక ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారు అనే దానిపై అనేక సర్వే సంస్థలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు అనే అంశంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అని స్పష్టం చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో కారును పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ మంగళవారం నాడు ఓ మీడియా చానెల్‌కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరోసారి జగనే అధికారంలోకి వస్తారనేది తన దగ్గరున్న సమాచారం అన్నారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ ఏపీలో మళ్లీ గెలిచేది జగనే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పొచ్చు. ఏపీలో మరోసారి తమదే అధికారం అని.. ఇప్పటికే అనేక సర్వే సంస్థలు చెప్పాయని.. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే స్పష్టం చేశారని.. విపక్ష కూటమి ఎంత ప్రచారం చేసినా.. జరగబోయేది ఇదే.. మరోసారి గెలిచేది జగనే అంటున్నారు. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద స్థాయిలో విమర్శలు చేశారు. ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు’ అనే రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు.
అలానే ఢిల్లీ లిక్కర్ కేసుపై తొలిసారి స్పందించారు కేసీఆర్. ప్రధాని మోదీ పొలిటికల్ స్కామ్‌లో భాగమని కేసీఆర్ పేర్కొన్నారు. తన కూతురు కవితను అరెస్ట్ చేయించి మోదీ పాపం చేశాడని.. కానీ లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలానే ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ.. ఇది సీఎంకు సంబంధించిన వ్యవహారం కాదని.. అయినా సరే కాంగ్రెస్ నేతలు తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ కేసీఆర్ కొట్టి పారేశారు. అలానే మళ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 98 స్థానాల్లో గెలుస్తుందని, తానే సీఎంను అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.