Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరగా, తాజాగా మరో కీలక నేత కూడా అదే బాట పట్టారు. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత సోదరుడు వైఎస్సార్ సీపీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరగా, తాజాగా మరో కీలక నేత కూడా అదే బాట పట్టారు. మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత సోదరుడు వైఎస్సార్ సీపీలో చేరారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవరత్తంగా సాగుతోంది. అధికార వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం, మేమంత సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని రెండు సార్లు పూర్తి చేశారు. మరో విడత ప్రచారంకు సిద్ధమవుతూ.. ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ వ్యూహాలకు ప్రతిపక్ష కూటమి సైతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే టీడీపీని వీడి పలువురు నేతలు వైసీపీలో చేరారు. తాజాగా టీడీపీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు ఆ పార్టీకి రాజీనామా చేసి…వైసీపీ లో చేరారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరగా, తాజాగా మరో కీలక నేత కూడా అదే బాట పట్టారు. ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, కాకినాడ పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.
2014,2019 రెండు సార్లు టీడీపీ తరుపున తుని నుంచి యనమల కృష్ణుడు పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆ రెండు సందర్భాల్లో వైసీపీ అభ్యర్థి, ప్రస్తుతం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు. అయితే 2024లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. అయితే యనమ రామకృష్ణుడి కుమార్తె దివ్వకు టీడీపీ టికెట్ కేటాయించింది. దీంతో చాలా రోజులుగా కృష్ణుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు వచ్చారు. ఇలానే శుక్రవారం టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు.
నేడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ.. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని తెలిపారు. అలానే పార్టీలో తొలి నుంచి ఉన్నవారిని మోసం చేశారని కృష్ణుడు మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీలో 42 ఏళ్లుగా ఉన్నానని, చంద్రబాబు, యనమల మోసం వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి తానే ఉదాహరణ అని కృష్ణుడు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్న తనకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్‌సీపీలో చేరానని కృష్ణుడు తెలిపారు.