ప్రభుత్వ పాఠశాలలో చదివే తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోవాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేరుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ కారణాలతో ఆంగ్ల మాధ్యమమును ప్రభుత్వ బడులలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని పేద పిల్లలకు సంక్షేమానికి కట్టుబడి ఇంగ్లీష్ మీడియం అమలుపై కొద్దిసేపటి క్రితం కీలక ఉత్తర్వులు రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసింది. నూతన విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర […]
పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దంటున్న క్యాడర్ బొబ్బిలి సంస్థానంలో ఇంతకన్నా దారుణమైన, దయనీయమైన పరిస్థితులు ఉండవేమో.. చిటికేస్తే వచ్చి నాయినా అంటూ వంగుని నిలబడే అభిమానులు ఇప్పుడు దూరం దూరం జరిగిపోతున్నారు.. పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దు నాయినా అని జారుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొబ్బిలిలో అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడమే కష్టం అయింది. అంతలోనే ఎంత మార్పు.. అవును… బొబ్బిలి సంస్థానాధీశుడు ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు 2009, 2014 లో కాంగ్రెస్స్ తరఫున ఎన్నికై […]
నేతల అంచనాలు తారుమారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలపై నేతలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం నుంచి 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఫలితంగా పూర్వం ఖారారు చేసిన రిజర్వేషన్లు తారుమారయ్యాయి. పలు చోట్ల పూర్తిగా సామాజికవర్గాలే మారిపోయగా, మరికొన్ని జిల్లాలో ఆయా సామాజికవర్గాల్లో మహిళలకు దక్కాయి. బీసీలకు గతంలో […]
వడ్డించే వాడు మనవాడైతే… అన్న సామెతను అక్షరాల నిజం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన పార్టీకి, తనునూయలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. పార్టీ కార్యాలయాలకు, సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వాటిపై ప్రస్తుత జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టీడీపీకి రెండు ఎకరాలు కేటాయించారు. ఆ కేటాయింపులను రద్దు చేయాలని ఇప్పటికే జగన్సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు జరిగిన […]
కర్నూల్ మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపుతుంది.. ఆర్ధిక ఇబ్బందులుతో పాటుగా, కొందరు నేతలు మోసం చేసారని మనస్తాపం చెందిన బంగి అనంతయ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు.అయితే ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు బంగి అనంతయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. తనకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని, సరైన పదవులు ఇవ్వడం లేదని మొదటినుండి చంద్రబాబును విమర్శిస్తూ వస్తున్న బంగి అనంతయ్య తాజాగా […]
తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కాన్వాయ్ ని సీతానగరం వద్ద కొందరు పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయంలో పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆ ప్రాంత రైతులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అప్పట్లో ఈ సమస్య మీద తమకు న్యాయం చెయ్యాలని కోరుతూ నిర్వాసిత రైతులు కొన్ని రోజులపాటు ఆందోళనలు కూడా […]
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఓ చర్చ పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా జరుగుతోంది. దీనంతటికీ ఇటీవల నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఇచ్చిన విందేనని అర్థమవుతుంది. అయితే దశాబ్దాల తరబడి నందమూరి నారా కుటుంబాలు కుటుంబాల్లో పరిస్థితులు పైకి బాగానే ఉన్నా.. ఇరు కుటుంబాల్లో లోలోపల ఎలా ఉన్నా.. అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్న సంగతి అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటన ద్వారా బయట పడుతూనే ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా 2019లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా […]
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ రోజు ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. నెల రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్ధేశించారు. మద్యం, నగదు పంపిణీ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. కొత్తగా తెచ్చిన నిబంధనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేశారని తేలితే గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారు. అంతే […]
దశాబ్దంన్నర కిందటి మాట. అప్పట్లో 2004 ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. మన రాష్ట్రంలో ఒకే నగరానికి చెందిన నలుగురు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. అప్పట్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, నాటి భద్రాచలం పార్లమెంట్ కి సీపీఎం తరుపున విజయం సాధించిన మిడియం బాబూరావు కూడా రాజమండ్రి వాసులే కావడం విశేషం. వారితో పాటుగా ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ […]
స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు (బీసి లు) 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్నయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు ని ఆశ్రయించగా పిటిషనర్ల వాదనని తోసిపుచ్చుతూ ఆ మేరకు […]