iDreamPost
android-app
ios-app

వీఆర్వోలు, కానిస్టేబుళ్లపై డీజిల్‌ పోసి హత్యాయత్నం

వీఆర్వోలు, కానిస్టేబుళ్లపై డీజిల్‌ పోసి హత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణ తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. తమ భూముల ఇచ్చేది లేదంటూ పలు చోట్ల యజమానులు భీష్మిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరగుతున్నాయి. తాగాజా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ముక్కంపూడి గ్రామంలో భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ఇద్దరు వీఆర్వోలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై స్థానికులు డీజిల్‌ పోసి హత్యాయత్నం చేశారు. అనంతరం వారూ డీజిల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు చొప్పున స్థలం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను గుర్తించి వాటిని పంపిణీకి సిద్ధం చేస్తోంది. పలు చోట్ల ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తోంది. ముక్కంపూడి గ్రామంలో ఇప్పటికే అసైన్డ్‌ భూములను పేదలకు ఇచ్చారు. అక్కడ వారు రేకుల షెడ్లు వేసుకుని నివశిస్తున్నారు. అయితే వాటికి పట్టాలు లేవు. ఈ నేపథ్యంలో ఆ భూముల ఖాళీ చేయించి, స్వాధీనం చేసుకునే క్రమంలో వివాదం నెలకొంది. ఇలాంటి వివాదాలు ఇంకా జరిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఓ పక్క సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఎవరి ఉసురు తగలకుండా భూములు సేకరించాలని ఆదేశించగా క్షేత్రస్థాయిలో పలుచోట్ల అందుకు భిన్నంగా సాగుతున్నట్లు తాజాగా ఘనట తేటతెల్లం చేస్తోంది.