iDreamPost
android-app
ios-app

OTTలో భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్.. అసలు మిస్ చేయొద్దు

  • Published Jun 11, 2025 | 9:05 PM Updated Updated Jun 11, 2025 | 9:05 PM

OTT Suggestions: నిత్యం ఓటిటి లో చాలా సినిమాలు,సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేయడం కామన్. ఇక క్రైమ్ సినిమాలనైతే కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మిస్ అయితే కనుక ఓ ఇంట్రెస్టింగ్ మూవీని మిస్ అయినట్లే.

  • Published Jun 11, 2025 | 9:05 PMUpdated Jun 11, 2025 | 9:05 PM
OTTలో భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్.. అసలు మిస్ చేయొద్దు

నిత్యం ఓటిటి లో చాలా సినిమాలు,సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేయడం కామన్. ఇక క్రైమ్ సినిమాలనైతే కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని మిస్ అయితే కనుక ఓ ఇంట్రెస్టింగ్ మూవీని మిస్ అయినట్లే. మరి ఈ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే బీహార్ రాష్ట్రంలో నేరాల రేట్ ఎక్కువగానే ఉంటుంది. హత్యలు , అత్యాచారాలు , మానవ అక్రమ రవాణ లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో అక్కడ మహిళల సేఫ్టీ కోసం షెల్టర్ హొమెస్ ను ఏర్పాటు చేస్తారు. వాటి అసలు లక్ష్యం అమ్మాయిలను కాపాడడం. కానీ ఆ పేరుతో అమ్మాయిలను ఆక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ మహిళా జర్నలిస్ట్ ఈ ఆశ్రమాల వెనుక ఉండే చీకటి కోణాన్ని బయటకు తీసుకుని వస్తుంది. ఈ విషయం గురించి పోరాడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ?ఈ ఆశ్రమాలలో చిక్కుకున్న అమ్మాయిలు ఎలా బయటపడతారు? అనేది మిగిలిన కథ.

ఈ సినిమా పేరు భక్షక్. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను చిత్రీకరించారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిసీన్ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ , క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడొచ్చు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.