Swetha
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్ని ఈ సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలియనిది కాదు. సినిమా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న సరే.. మూవీ మేకర్స్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి హడావిడి లేదు. పైగా ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని అంటున్నారు. దీనితో అటు మూవీ టీం , ఇటు అభిమానులు , ఎగ్జిబిటర్లు కాస్త టెన్షన్ టెన్షన్ గానే ఉన్నారు. ఈ క్రమంలో మూవీ రన్ టైం ను లాక్ చేశారు.

శేఖర్ కమ్ముల , నాగార్జున , ధనుష్ , రష్మిక కాంబినేషన్ లో వస్తున్న మూవీ కుభేర. ఈ నెలలో రావాల్సిన బిగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్ని ఈ సినిమా మీదే ఆధారపడి ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలియనిది కాదు. సినిమా మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న సరే.. మూవీ మేకర్స్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి హడావిడి లేదు. పైగా ఇంకా 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని అంటున్నారు. దీనితో అటు మూవీ టీం , ఇటు అభిమానులు , ఎగ్జిబిటర్లు కాస్త టెన్షన్ టెన్షన్ గానే ఉన్నారు. ఈ క్రమంలో మూవీ రన్ టైం ను లాక్ చేశారు.
వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా రన్ టైం 3 గంటల 15 నిమిషాలట. అసలే శేఖర్ కమ్ముల సినిమాల రన్ టైం కాస్త ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. సో ఈ సినిమాకు కూడా ఎక్కువ రన్ టైం నే కేటాయించాడట దర్శకుడు. అప్పుడంటే ఎదో అలా కలిసి వచ్చింది. మరి ఇప్పుడు కూడా అంతంత సేపు ప్రేక్షకులు తమ సమయాన్ని కేటాయిస్తారా అంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే . ఎంతో డెప్త్ ఉన్న సినిమాలు లేదా మాస్ యాక్షన్ సినిమాలైతే తప్ప ప్రేక్షకులు కన్విన్స్ అవట్లేదు. మరి ఈ టైం లో శేఖర్ కమ్ముల రిస్క్ తీసుకుంటున్నాడా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
నిజానికి శేఖర్ కమ్ముల సినిమాలకు సెపరేట్ క్లాస్ ఫాలోయింగ్ ఉంటుంది. గోదావరి హ్యాపీడేస్ లాంటి సినిమాలు అర్రే ఇంకొంచెం సేపు ఉంటె బావుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ను నమ్ముకుని శేఖర్ ఈ రన్ టైం ఫిక్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు. కానీ కుభేర ఆ జోనర్ మూవీ కాదు. ఒకవేళ ఈ మూవీ కూడా మొదటి నుంచి ఎంగేజింగ్ గా ఉంటే కనుక.. మూవీకి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ కాస్త అటు ఇటు అయినా రిస్క్ తప్పదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.