iDreamPost
android-app
ios-app

పెద్ద ప్లానింగ్ ఏ.. త్రివిక్రమ్ నుంచి ఊహించని ట్విస్ట్

  • Published Jun 11, 2025 | 11:20 AM Updated Updated Jun 11, 2025 | 11:20 AM

అసలు ఇంకా అధికారిక ప్రకటన రాకముందే త్రివిక్రమ్ సినిమాల గురించి ఫిలిం నగర్ వర్గాలు , సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ముందు వెంకటేష్ తో అని అన్నారు.. ఇంకో నెల రోజుల్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఉండొచ్చనే టాక్ వచ్చింది. ఇదిలా ఉండగానే చరణ్ తో ప్రాజెక్ట్ లైన్ లో ఉందనే న్యూస్ మెగా ఫ్యాన్స్ ను యాక్టివ్ చేసింది. ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉండగా ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చేసింది.

అసలు ఇంకా అధికారిక ప్రకటన రాకముందే త్రివిక్రమ్ సినిమాల గురించి ఫిలిం నగర్ వర్గాలు , సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ముందు వెంకటేష్ తో అని అన్నారు.. ఇంకో నెల రోజుల్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఉండొచ్చనే టాక్ వచ్చింది. ఇదిలా ఉండగానే చరణ్ తో ప్రాజెక్ట్ లైన్ లో ఉందనే న్యూస్ మెగా ఫ్యాన్స్ ను యాక్టివ్ చేసింది. ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉండగా ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చేసింది.

  • Published Jun 11, 2025 | 11:20 AMUpdated Jun 11, 2025 | 11:20 AM
పెద్ద ప్లానింగ్ ఏ.. త్రివిక్రమ్ నుంచి ఊహించని ట్విస్ట్

త్రివిక్రమ్ రామ్ చరణ్ తో మూవీ తీస్తాడా.. లేదా వెంకటేష్ తోనా.. అసలు త్రివిక్రమ్ ఏమి చేయబోతున్నాడు. ఈ మాటల మాంత్రికుడితో జత కట్టబోయేది ఎవరు..అని త్రివిక్రమ్ గురించి గత కొద్దీ రోజులుగా ఏవో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఇంకా అధికారిక ప్రకటన రాకముందే త్రివిక్రమ్ సినిమాల గురించి ఫిలిం నగర్ వర్గాలు , సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ముందు వెంకటేష్ తో అని అన్నారు.. ఇంకో నెల రోజుల్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ ఉండొచ్చనే టాక్ వచ్చింది. ఇదిలా ఉండగానే చరణ్ తో ప్రాజెక్ట్ లైన్ లో ఉందనే న్యూస్ మెగా ఫ్యాన్స్ ను యాక్టివ్ చేసింది. ఈ న్యూస్ ట్రెండింగ్ లో ఉండగా ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చేసింది.

అల్లు అర్జున్ తో అనుకున్న ఫాంటసీ సినిమాను త్రివిక్రమ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తీయబోతున్నారట. ఈ న్యూస్ అందరికి సర్ప్రైజింగ్ గానే అనిపించింది. అయితే ఇది ఇప్పటికి ఇప్పుడు సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దేవర 2 లైన్ లో ఉంది. దాని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఓ మూవీ ఉండొచ్చనే టాక్ ఉంది. మొన్నీమధ్యనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ టాపిక్ ఒకటి బయటకు వచ్చింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోపు అటు ఇటుగా రెండు మూడేళ్లు గడిచిపోతుంది.

అప్పటికీ త్రివిక్రమ్ ముందుగా ఒప్పుకున్న చరణ్ , వెంకటేష్ సినిమాలు కంప్లీట్ చేస్తే.. అప్పుడు ఈ కాంబో సెట్స్ మీదకు వస్తుంది. ప్రస్తుతానికైతే ప్లానింగ్ ఇలా ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. ఇక ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ చేసేలా అయితే కుమార స్వామి అంశను బ్యాక్డ్రాప్ గా తీసుకుని ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడట త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ రాసుకున్న సబ్జెక్టు కు ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş