Idream media
Idream media
పార్టీకి కొత్త రక్తం కావాలి.. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా చూసినా పార్టీలో సీనియర్లే కనిపిస్తున్నారు.. పార్టీకి యువ న్యాయకత్వం కావాలి.. పార్టీలో నూతన జవసత్వాలు నింపాలి.. ఇది గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్న డిమాండ్.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేశ్ కొన్నేళ్లక్రితం నుండే పార్టీని నడిపించేందుకు సిద్ధమైనా ఆయనకు చంద్రబాబు పూర్తిస్థాయిలో పగ్గాలు ఇవ్వలేదు. లోకేశ్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నా కీలక నిర్ణయాల విషయంలో మళ్లీ చంద్రబాబు వద్దకే అందరూ వెళ్లాల్సివస్తోంది. అయితే ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉంది.. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. ఎంత కాదనుకున్నా వయసు పెరగేకొద్దీ శారీరకంగా, మానసికంగా విశ్రాంతి కచ్చితంగా అవసరం. కాబట్టి చంద్రబాబు తర్వాత పార్టీలో రెండవస్థానంలో ప్రస్తుతానికి లోకేశ్ బాబే ఉండడంతో ఆయనను వచ్చే ఎన్నికలనాటికి సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు అర్ధమవుతోంది.
తాజాగా ఏపీకి చెందిన టీడీపీ యువ నేతలకు లోకేశ్ తన భార్య బ్రాహ్మణితో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో విందు ఇచ్చారు. భార్యాభర్తలను కలిపి ఆహ్వానించడంతో సుమారు ముప్పైఐదు జంటలు ఈ విందుకు హాజరయ్యాయి. గత ఎన్నికల్లో పోటీచేసిన యువనేతలు, తాజా రాజకీయాల్లో చురుగ్గా ఉండి వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేసే అవకాశం ఉన్న కొందరు నేతలు, పార్టీలోని పలువురు నేతల వారసులను ఈ విందుకు ఆహ్వానించారు. హాజరైనవారిలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, గౌతు శిరీష, బండారు అప్పలనాయుడు, చింతకాయల విజయ్, టీజీ భరత్, జేసీ పవన్‌కుమార్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, భూమా అఖిలప్రియ, కేఈ హరి, గాలి భానుప్రకాశ్, గాలి భాను ప్రకాష్, బొజ్జల సుధీర్, కోడెల శివరామ్, దేవినేని చందు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరినీ పార్టీ భావి నాయకులుగా భావించి లోకేష్ సమావేశమైట్లు అర్ధమవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రజల వాణిని వినిపించాలని, పార్టీ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని లోకేశ్ సూచించారట. ఈ సమావేశంలో కొద్దిసేపు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు దంపతులు సైతం పాల్గొన్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని, పార్టీకోసం కష్టపడ్డవారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని చంద్రబాబు భరోసా ఇచ్చినట్టు తెలస్తోంది.
ఇప్పటివరకూ అయితే టీడీపీ క్యాడర్ లో చంద్రబాబు మాటే శిరోధార్యం.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు లేరు.. కానీ భవిష్యత్తులో పార్టీ పగ్గాలను లోకేశ్ చేతిలో పెడితే అందరూ అంగీకరిస్తారా లేదా ఎవరైనా అభ్యంతరం చెబుతారా అనేది కూడా ఒక డోలాయమానం.. ఎందుకంటే లోకేశ్ పనితీరును కొందరు ఇన్ డైరక్ట్ గా వ్యతికిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. ముఖ్యంగా లోకేశ్ ఇప్పటివరకూ ఎమ్మెల్యేగానూ గెలవలేదు. గత ఎన్నికల్లో ఆయన గెలుపునకు పార్టీ సర్వశక్తులూ ఒడ్డినా ఓటమి చెందారు. ఈ క్రమంలో అసలు లోకేశ్ న్యాయకత్వాన్ని పార్టీ శ్రేణులు ముక్త కంఠంతో సమర్ధిస్తారా అంటే అది కూడా అనుమానమే.. ఈ క్రమంలో 2024 ఎన్నికలకూ చాలా గ్యాప్ ఉండడంతో చంద్రబాబు నెమ్మదిగా లోకేశ్ ను ప్రొజెక్ట్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. అందుకోసమే ఈ విందులు, ఉపన్యాసాలు ఇస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు.
మరోవైపు లోకేశ్ తో పాటు బ్రాహ్మణి కూడా ఇక్కడ పార్టీలోని యంగ్ లీడర్లకు తన సూచనలు, సలహాలివ్వడం విశేషం. అయితే పార్టీకి యువరక్తం, నూతన రక్తం కావాలంటే ఇప్పటివరకూ పాతుకుపోయిన పార్టీ నేతల వారసుల్ని పరిచడం చేయడం కరెక్ట్ కాదని, కొత్తరక్తం కూడా ఎక్కించాలని అంటే బయట పార్టీకోసం పనిచేస్తున్న యువతకు అవకాశం ఇవ్వాలని, వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉన్నందున హాత్మకంగా కొత్తవ్యక్తులను పైకితీసుకొస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయనేది లోకేశ్ గ్రహించాలి.