iDreamPost
android-app
ios-app

కోర్ట్ తీర్పు కి లోబడే ఎన్నికలకు వెళతాం

కోర్ట్ తీర్పు కి లోబడే ఎన్నికలకు వెళతాం

స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ వారి ఆదేశాలనుసారం ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానికసంస్థల ఎన్నికల్లో బిసిలకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయామనే బాద ముఖ్యమంత్రి కి, తమకు ఉన్నప్పటికీ కోర్ట్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని బొత్సా స్పష్టం చేశాడు.

తమ ప్రభుత్వం బలహీనవర్గాలకు మేలుచేసే ప్రతి అంశంలోనూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అడ్డుకుంటున్నాడని రాష్ర మంత్రి బొత్సా సత్యనారాయణ ఆరోపించాడు. స్థానిక సంస్థల బిసి రిజర్వేషన్ల అంశం విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో 59 శాతం అవకాశం ఇవ్వాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటే, ఇప్పటివరకు ఆ వర్గాల ఓట్ల తో రాజకీయంగా లబ్ది పొంది, రాజకీయ పదవులనుభవించి ఇప్పుడు బిసిలకు వెన్నుపాటు పొడిచిన ఘనత ప్రతిపక్ష నాయకుడికే చెందుతుందని బొత్సా తీవ్రంగా మండిపడ్డారు. చరిత్రలో ఎస్సి ఎస్టీలకు బిసిలను రాజకీయంగా వాడుకొని వారిని అణగదొక్కిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర చరిత్రలో మొదటిసారి మొత్తం 216 మార్కెట్ కమిటీలలో 50 శాతం ఎస్సి ఎస్టీలకు బిసిలకు కేటాయించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుందని బొత్స పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రభుత్వం బలహీన వర్గాలకు మేలు చేసే కార్యాక్రమాలకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఎస్సి ఎస్టీ కమిషన్ మాలా మాదిగలకు వేరుగా కార్పొరేషన్ ఏర్పాటు విషయంలోనూ అదేవిధంగా పేద విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లిష్ మీడియం విద్య విషయంలోనూ ప్రతిపక్షం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని బొత్సా మండి పడ్డారు.