Idream media
Idream media
నేతల అంచనాలు తారుమారయ్యాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలపై నేతలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం నుంచి 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఫలితంగా పూర్వం ఖారారు చేసిన రిజర్వేషన్లు తారుమారయ్యాయి. పలు చోట్ల పూర్తిగా సామాజికవర్గాలే మారిపోయగా, మరికొన్ని జిల్లాలో ఆయా సామాజికవర్గాల్లో మహిళలకు దక్కాయి. బీసీలకు గతంలో నాలుగు స్థానాలుండగా.. అందరూ ఊహించినట్లే 50 శాతం రిజర్వేషన్ల వల్ల ఒక స్థానం తగ్గింది.
తాజా రిజర్వేషన్లతో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు మూడు, జనరల్‌కు ఏడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలు ఖరారు చేశారు. ఎస్టీలకు కేటాయించిన ఒక్క స్థానం మహిళకు, ఎస్సీల్లో ఒకటి మహిళ, మరోకటి జనరల్, బీసీలకు కేటాయించిన మూడు స్థానాల్లో మహిళలకు రెండు చైర్మన్ పీఠాలు దక్కనున్నాయి. జనరల్‌లో ఉన్న ఏడు స్థానాల్లో మహిళలకు మూడు స్థానాలు కేటాయించారు.
జిల్లా అప్పుడు ఇప్పుడు
శ్రీకాకుళం ఎస్సీ మహిళ బీసీ మహిళ
విజయనగరం జనరల్ జనరల్
విశాఖ బీసీ మహిళ ఎస్టీ మహిళ
తూర్పుగోదావరి జనరల్ మహిళ ఎస్సీ
పశ్చిమగోదావరి బీసీ మహిళ బీసీ
కృష్ణ బీసీ జనరల్ మహిళ
గుంటూరు జనరల్ మహిళ ఎస్సీ మహిళ
ప్రకాశం జనరల్ జనరల్ మహిళ
నెల్లూరు ఎస్టీ జనరల్ మహిళ
కడప జనరల్ జనరల్
అనంతపురం ఎస్సీ బీసీ మహిళ
కర్నూలు జనరల్ మహిళ జనరల్
చిత్తూరు బీసీ జనరల్