iDreamPost
android-app
ios-app

లోకేష్‌లో ఆ మార్పు కనిపిస్తోంది..!

లోకేష్‌లో ఆ మార్పు కనిపిస్తోంది..!

నారా లోకేష్‌… మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడుగా, మాజీ మంత్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. గత ప్రభుత్వ హయాంలో అంతా ఆయనదే హవా. చినబాబుగా పేరొందిన లోకేష్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. పలు మార్లు ప్రసంగాల్లో తడబాటు, పదాలను సరిగా పలకలేకపోవడంతో సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అయ్యేవారు. ఆయన శరీరాకృతిపై కూడా సెటైర్లు పడేవి. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా అయితే.. ఏకంగా పప్పు అంటూ హేళన చేసేది. అధికారం నుంచి దూరమైన తర్వాత లోకేష్‌ శరీరాకృతిపై సోషల్‌ మీడియాలో సెటైర్లు బాగా తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి.

చిన్న వయస్సులోనే నారా లోకేష్‌ లావుగా ఉండడం బహుసా ఆయన ఆహార అలవాట్ల వల్ల జరిగుండొచ్చు. సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో భారీకాయంతో ఉండేవారు. 2007లో వచ్చిన యమదొంగ సినిమాలో తొలిసారిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ నాజూగ్గా కనిపించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ పూర్వపు స్థితికి రాకుండా సన్నగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే తరహాలో నారా లోకేష్‌ కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. బరువు తగ్గేందుకు చినబాబు ప్రత్యేకమైన కసరత్తులు చేస్తున్నట్లుగా ఆయన్ను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది.

మంత్రిగా ఉన్నప్పుడే నారా లోకేష్‌ బరువు తగ్గే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. మంత్రిగా ఉండడంతో తీరికలేమి ఆయన ఆ వైపు దృష్టి పెట్టేందుకు అవకాశం లేకపోయింటుంది. 2019 ఎన్నికల తర్వాత సమయం చిక్కడంతో చినబాబు బరువు తగ్గడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గతం కన్నా కొంచెం తగ్గినట్లు కనిపిస్తున్నారు. తమ యువ నాయకుడిలో వస్తున్న మార్పును చూసి టీడీపీ శ్రేణులు కూడా సంతోషిస్తున్నాయి. బహుసా మరి కొద్ది రోజుల్లో నారా లోకేష్‌ నాజూగ్గా కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.