తెలంగాణ ఆర్టీసీ మరోసారి ప్రజలపై చార్జీల భారం మోపింది. ఈ ఏడాది మార్చిలోనే డీజిల్ సెస్సు పేరుతో రెండు నుంచి అయిదు రూపాయల దాకా పెంచింది. తాజాగా కిలోమీటరు వారీగా మళ్ళీ డీజిల్ సెస్సును వడ్డించింది. అలాగే విద్యార్థుల బస్ పాసు ఛార్జీలను కూడా పెంచాలని అనుకుంటుంది. దీంతో మరోసారి సామాన్య ప్రజలపై భారీ భారం పడనుంది. డీజిల్ భారం భరించలేకే మరో దఫా సెస్సును పెంచుతున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ […]
ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధాన్ని విధించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గవర్నమెంట్ డాక్టర్లు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. ప్రభుత్వ డాక్టర్లకు డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కొత్త డాక్టర్లకు ఆ అవకాశంలేదు. […]
కరోనా కల్లోల సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 16 ప్రజాసంఘాలను నిషేధించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీపై మరో ఏడాదిపాటు బ్యాన్ కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నాయంటూ 16 సంఘాలపైనా వేటు వేసింది. ఇందులో ‘విరసం(విప్లవ రచయితల సంఘం)’ కూడా ఉండటం గమనార్హం. పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వీటిపై ఏడాదిపాటు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు […]
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడానికి, వెంటనే అమలు చేయకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కారణాలు ఉంటాయి. ఇందులో రాజకీయ పరమైన కారణాలతోపాటు ప్రజా శ్రేయస్సు కోణం కూడా ఉంటుంది. ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం మంచిదే. కానీ అదే సమయంలో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకపోవడం ప్రజలకు భారీ నష్టం చేకూరుస్తుంది. కొద్ది కాలానికి అమలు చేసినా.. జరిగిన నష్టం పూడ్చుకోలేనిదిగా ఉంటుంది. వ్యవసాయపంపు సెట్లకు […]
అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నీటిపారుదల కాలువల ఆధునికీకరణ, సామరథ్యం పెంపు చేపడుతోందని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ ఛీప్ మురళీధర్ ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలతో కూడిన లేఖను కృష్ణా బోర్టు కార్యదర్శికి పంపారు. ఏపీ చేపట్టే పనులను నిలువరించాలని లేఖలో కోరారు. తెలంగాణ తాజా ఫిర్యాదులు వీటిపై.. – పోతిరెడ్డి పాడు నుంచి ఆమోదం లేకుండానే 35 వేల క్యూసెక్కుల నీటిని […]
ప్రముఖ కవి, జానపద కళాకారుడు, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్నను తెలంగాణ సీఎం కేసీఆర్ శాసన మండలి సభ్యునిగా ఎంపిక చేశారు. గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నను శాసన మండలికి పంపించాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోరేటి వెంకన్న తన గళాన్ని వినిపించారు. తెలంగాణ యాస, భాషలతో పాటలు పాడుతూ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. ఈ నేపథ్యంలోనే గోరేటి వెంకన్నను శాసన మండలికి […]
ఏదైనా ఒక పథకాన్ని ప్రకటించడం ఒకెత్తయితే, దానిని సక్రమంగా అర్హులకు అందజేసే వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం మరొక ఎత్తు. ఈ పంపిణీలో ఏ మాత్రం తేడా వచ్చినా పథకం లక్ష్యమే మారిపోతుంది. అంతిమంగా ఇచ్చి మరీ తిట్టించుకోవాల్సి రావొచ్చు. దీనికి ప్రధాన ఉదాహరణ తెలంగాణా రాష్ట్రంలోని తుఫాను బాధితులకు రూ. 10వేల రూపాయల పంపిణీగా చెప్పొచ్చు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 10వేలు అందజేయాలని తెలంగాణా సీయం కేసీఆర్ […]
పోలవరం కుడికాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. […]
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అఖిలభారత సర్వీస్ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పదో తరగతి పరీక్షపైనా పడింది.కరోనా వైరస్ ఎఫెక్ట్తో మొదటినుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.అత్యున్నత శానిటేషన్ పద్ధతులు పరీక్షా కేంద్రాలలో అమలు చేసి పరీక్షల నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. కానీ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 కు చేరిన పరిస్థితులలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.శుక్రవారము పిల్ పై అత్యవసర విచారణ హైకోర్టు […]