iDreamPost
android-app
ios-app

Rythu Runa Mafi: తెలంగాణ రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేపటి నుంచి ఇంటి వద్దకే

  • Published Aug 26, 2024 | 8:58 AM Updated Updated Aug 26, 2024 | 8:58 AM

TG Govt-App, Rythu Runa Mafi: తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హులైనా సరే కొందరికి రుణమాఫీ కాలేదు. అలాటి వారికి ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

TG Govt-App, Rythu Runa Mafi: తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్హులైనా సరే కొందరికి రుణమాఫీ కాలేదు. అలాటి వారికి ప్రభుత్వం కీలక అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

  • Published Aug 26, 2024 | 8:58 AMUpdated Aug 26, 2024 | 8:58 AM
Rythu Runa Mafi: తెలంగాణ రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేపటి నుంచి ఇంటి వద్దకే

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు.. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది అనగా 2024, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. మెుత్తం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ అమలు కోసం.. కాంగ్రెస్‌ సర్కార్‌.. ఏకంగా రూ. 31 వేల కోట్లను ఖర్చు చేసింది. అయితే అర్హతలు ఉన్నా సరే.. కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవటం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టాదార్ పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవటం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. అంతేకాక 2 లక్షల రూపాయలకు పైగా లోన్‌ ఉన్న రైతులు.. ఆ మొత్తాన్ని చెల్లించని కారణంగా.. రుణమాఫీ వర్తించలేదు.

ఈ నేపథ్యంలో రుణమాఫీ వర్తించని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌’ ను తెలంగాణ వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల వివరాలను తెలుసుకొని వాటిని యాప్‌లో నమోదు చేయాలని రేవంత్‌ సర్కార్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటి నుంచి అనగా.. ఆగస్టు 27, మంగళవారం నుంచే సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.

Runamaafi

డైరెక్టుగా ఇంటికే అధికారులు..

అంతేకాక రుణమాఫీ కానీ అర్హులైన రైతుల వివరాల నమోదు కోసం.. అధికారులు.. నేరుగా.. వారి ఇంటికే వద్దకే వెళ్తారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్‌ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తీసుకొని యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్లు పైబడిన కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం సైతం తీసుకుంటారు. దీనిలో కుటుంబ యజమాని తన లోన్ అకౌంట్, సంబంధిత బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను తాను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేయాల్సి ఉంటుంది. అందులోనే ఫోన్ నెంబర్ కూడా రాయాలి. ఆ తర్వాత వాటిని  గ్రామ కార్యదర్శి అటెస్టేషన్‌ చేయాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా రైతుల నుంచి అదనపు మొత్తాల వసూలు చేయాలని వ్యవసాయశాఖ ఇప్పటికే బ్యాంకులకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదన్న కారణంతో ప్రస్తుతం బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాలను తీసుకోవడం లేదు. తాజాగా ఆయా రైతులకు ఊరటనిచ్చేలా బ్యాంకులకు సర్కార్‌ లేఖ రాసింది. అయితే 2 లక్షల రూపాయల పైన లోన్‌ ఉన్న వారు.. అదనపు మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లించిన తర్వాత.. ఎన్ని రోజులకు,  ఎప్పటి వరకు రుణమాఫీ చేసేది ఇంకా వెల్లడించలేదని అధికారులు తెలిపారు.