iDreamPost
android-app
ios-app

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే షురూ.. అడిగే ప్రశ్నలివే..!

  • Published Nov 06, 2024 | 10:34 AM Updated Updated Nov 06, 2024 | 10:34 AM

Conduct Caste Census Checks: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) బుధవారం (నవంబర్ 6) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య, కుల సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తుంది.

Conduct Caste Census Checks: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) బుధవారం (నవంబర్ 6) నుంచి ప్రారంభం కానున్నది. ఈ ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య, కుల సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తుంది.

  • Published Nov 06, 2024 | 10:34 AMUpdated Nov 06, 2024 | 10:34 AM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే షురూ.. అడిగే ప్రశ్నలివే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కులగణన టాపిక్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఒకేఒక్క సర్వేతో కులాల లెక్క తేల్చి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చేస్తామని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే బుధవారం (నవంబర్ 6) నుంచి మూడు వారాల పాటు కులగణన సర్వే చేయబోతున్నారు. ఈ ప్రక్రియ కోసం 50 వేల మందికి పైగా సిబ్బంది పనిచేయబోతున్నారు. ఇప్పటికే ప్రైమరీ స్కూళ్ళకు ఒంటిపూట బడులను పెట్టి వేలాది మంది ఉపాధ్యాయులను ఈ పనికి వాడబోతుంది. ఈ మూడు వారాలు శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య, కుల సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కులగణన ప్రక్రియ నేటి నుంచి మొదలైంది.  గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలో గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో, వార్డ్ నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు తో సహా నమోదు చేస్తారు. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షకుడు అధికారిగా ఉంటారు. ప్రత్యేకంగా ఇందుకోసం సర్వే కిట్స్ ఉన్నాయి. ఈ సర్వేకు సంబంధించి 75 ప్రశ్నలతో ఫార్మాట్ తయారు చేశారు. పార్ట్ – 1 లో 60 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, సెల్ ఫోన్ నెంబర్ ఇలా పలు వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఇక పార్ట్ – 2లో కుటుంబం ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు ఎన్యూమరేటర్లు. మొత్తం వివరాలు పూర్తి అయ్యాక, తాను చెప్పిన వివరాలు అన్నీ నిజమే అని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఆధార్ కార్డులు, ధరణి పాస్ బుక్ లు దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు వివరాలు చెప్పడం సులభం అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు ఎంతమంది నివసిస్తున్నారు అనేది కూడా సర్వేలో తేలనుంది. ఇందుకోసం సర్వే పత్రంలో మాతృభాషలో కాలమ్ ఉంది. వీటి కోసం 19 రకాల కోడ్ లు కేటాయించారు. తమిళం, మలయాళం, కన్నడ ఇతర ఉత్తరాధి రాష్ట్రాల మాతృభాషలు ఉంటాయి. అలాగే లంబాడీ, కోయ, గోండు లాంటి ఆదివాసీలు, గిరిజనులు మాట్లాడే మాతృభాషల వివరాలు కూడా నమోదు చేయనున్నారు.

కులగణనలో దివ్యాంగులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించనున్నారు. వారి వైకల్యం తీవ్రత, కండరాల క్షీణత, యాసిడ్ బాధితులు, మరుగుజ్జు, ఆటిజం, నత్తి, మానసిక వైకల్యం, తలసీమియా తదితర 13 రకాల వైకల్యాలక వివరాలు కూడా సేకరించనున్నారు. వివాహం అయినవారు, వివాహం కాని వారి వివరాలు సేకరించనున్నారు. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా నమోదు చేసుకుంటారు. అలాగే వార్షిక ఆదాయం, ఆదాయపన్ను చెల్లింపులు గురించి కూడా తెలుసుకుంటారు. వ్యవసాయం, బీడీ, హూటల్, కార్ఖానా, హమాలీ, గనులు కూలీలు, ఇసుక బట్టీ కార్మికులు, ఉపాది హామీ తదితర వివరాలు సేకరించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ నుంచి పొందిన సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ నేపథ్యం లాంటి వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోబోతున్నారు.

ప్రస్తుతం ఈ సర్వే 2011 జనాభా లెక్కల ఆధారంగా సేకరించిన నివాసాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని, ఎన్యమరేషన్ బ్లాక్ ల జాబితాలో తయారు చేశారు. గడిచిన 14 ఏళ్లలో భారీగా పెరిగిన గృహాలు, ముందుగా వీటిని గుర్తించేందుకు హౌస్ లిస్టింగ్ ను చేపడుతున్నారు. అయితే 2011 జనాభా లెక్కల కోసం అనుసరించిన ఒక్కో ఎన్యుమరేషన్ బ్లాక్ లో కొత్తగా నిర్మాణమైన ఇండ్లను గుర్తిం, ఇంకా ఎన్యుమరేటర్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుందా? లేదా అనేది ముందుగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారు. వాళ్లలో ఎంతమంది నిరుపేదలు పేదలు..ఎంతమంది ఉన్నత వర్గానికి చెందిన వారు.. ఎంతమంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు అన్న విషయంపై సమగ్ర సమాచారం తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఎంతమందికి దక్కాల్సింది దక్కడం లేదు.. అనే లెక్క తీసి.. పక్కా రిపోర్ట్‌ తయారు చేయడం కోసమే కులగణన ముఖ్య ఉద్దేశం. సర్వే కోసం వచ్చే సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, తప్పుడు సమాచారం అందిస్తే కఠినంగా శిక్షిస్తామని అధికారులు అంటున్నారు.