iDreamPost
android-app
ios-app

Bathukamma Kanuka: మహిళలకు గుడ్ న్యూస్.. బతుకమ్మకు చీరలు కాదు.. కొత్త కానుక!

Details About Revanth Sarkar Bathukamma Gift: తెలంగాణ మహిళలకు ఎంతో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మకు చీరల స్థానంలో కొత్త కానుకను ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది.

Details About Revanth Sarkar Bathukamma Gift: తెలంగాణ మహిళలకు ఎంతో ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మకు చీరల స్థానంలో కొత్త కానుకను ఇచ్చేందుకు రెడీ అయిపోతోంది.

Bathukamma Kanuka: మహిళలకు గుడ్ న్యూస్.. బతుకమ్మకు చీరలు కాదు.. కొత్త కానుక!

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంత ప్రత్యేకనదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఒక్క తెలంగాణలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడపడుచులు ఈ బతుకమ్మను సంబరంగా చేసుకుంటారు. అలాంటి ఎంతో ముఖ్యమైన బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది అని తెలుస్తోంది. ఇప్పటివరకు బతుకమ్మకు సంబంధించి కానుకగా ప్రభుత్వం చీరలను పంపిణీ చేసేది. కానీ, ఇప్పుడు బతుకమ్మ కానుకకు సంబంధించి రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణ మహిళలకు బతుకమ్మకు చీరలకు బదులుగా కొత్త కానుకను ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందంట.. మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చు అంటున్నారు. అసలు చీరలకు బదులుగా రేవంత్ సర్కార్ కొత్త కానుక ఏం ఇచ్చే ఆస్కారం ఉంటుందో చూద్దాం.

తెలంగాణ మహిళలకు బతుకమ్మ అంటే ఎంతో ప్రత్యేకమైన పండుగ. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బతుకమ్మను జరుపుకుంటారు. అలాంటి ముఖ్యమైన పండుగకు ప్రభుత్వం తరఫున మహిళలకు బహుమతులుగా కూడా ఇచ్చేవాళ్లు. గత ప్రభుత్వం అయితే బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేసేది. ప్రతి బతుకమ్మకు వారికి చీరలను ఇస్తూ వచ్చారు. అయితే ఈ చీరల విషయంలో చాలానే గొడవలు, విమర్శలు, నిరసనలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. చీరల నాణ్యత లేదు అని కొందరు.. అర్హులైనా కూడా తమకు చీరలను ఇవ్వలేదు అని మరికొందరు అయితే గొడవలు చేయడం చూశాం. ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ బతుకమ్మ పండుగ విషయంలో రేవంత్ సర్కార్ కూడా మహిళలకు కానుక ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అయితే గత ప్రభుత్వం మాదిరి బతుకమ్మ చీరలను మాత్రం పంపిణీ చేయడం లేదు అని విశ్వనీయ సమాచారం అందుతోంది. ఆ స్థానంలో ప్రభుత్వం కొత్త కానుక ఇచ్చందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఇన్నాళ్లు బతుకమ్మ అనగానే చీరల పంపిణీనే గుర్తొచ్చేది. కానీ, ఆ సంప్రదాయాన్ని రేవంత్ సర్కార్ కొనసాగించేందుకు సిద్ధంగా లేదు అని తెలుస్తోంది. బతుకమ్మకు చీరల స్థానంలో అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున నగదు ఇవ్వాలని భావిస్తున్నారంట. కుదిరితే ఆ నగదు మొత్తం రూ.500కి మించి కూడా ఉండే అవకాశం ఉండబోతోందని సమాచారం. చీరలకు బదులుగా నగదు ఇవ్వడమే సరైన నిర్ణయంగా ప్రభుత్వం భావిస్తోందంట. చీరలు ఇస్తే నాణ్యత విషయంలోనో.. మన్నిక విషయంలోనో విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే నగదు పంపిణీ చేయడం వల్ల మహిళలకు పండుగ ఖర్చులకు కూడా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే నగదు పంపిణీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ నగదు పంపిణీ చేస్తే.. డబ్బును బ్యాంకు ఖాతాల్లో వేయాలా? నేరుగా మహిళలకు అందించాలా? అనే విషయంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. మరో రెండ్రోజుల్లో బతుకమ్మ కానుక విషయంలో స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం చీరలకు బదులుగా కచ్చితంగా నగదు పంపిణీనే ఉంటుందని బలంగా చెబుతున్నారు. అయితే డ్వాక్రా మహిళలుక ఇవ్వాలా? తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఇవ్వాలా అనే దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. బతుకమ్మ చీరలు ఆపేస్తే.. నేతన్నల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ పథకం నేతన్నలకు కచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి.. బతుకమ్మకు చీరలకు బదులుగా నగదు పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.