iDreamPost
android-app
ios-app

బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు గుడ్‌న్యూస్.. పోలీసు శాఖ కీలక నిర్ణయం!

  • Published Oct 26, 2024 | 11:32 AM Updated Updated Oct 26, 2024 | 11:32 AM

Telangana Battalion Constables: తెలంగాణ రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుళ్ళ భార్యలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Telangana Battalion Constables: తెలంగాణ రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం ఉండాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విధానాన్ని అమలు చేయాలని కానిస్టేబుళ్ళ భార్యలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

  • Published Oct 26, 2024 | 11:32 AMUpdated Oct 26, 2024 | 11:32 AM
బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు గుడ్‌న్యూస్.. పోలీసు శాఖ కీలక నిర్ణయం!

తెలంగాణ రాష్ట్రంలో  ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. కానిస్టేబుళ్ళ భార్యల ఆందోళన ఉదృతం కావడంతో దిగివచ్చిన ప్రభుత్వం, పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బెటాలియన్ కానిస్టేబుళ్లకు సెలవులు రద్దుకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలకు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్ పోలీసులకు ఊరట లభించింది. అంతేకాదు ప్రభుత్వం బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలకు సంబంధించి వారితో చర్చించేందుకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోెకి వెళితే..

కొంత కాలంగా బెటాలియన్ పోలీసులను కూలీల కన్నా ఘోరంగా చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెటాలియన్ కానిస్టేబుళ్ళను కూలీల కన్నా హీనంగా చూస్తున్నారని.. మట్టి పనులు, ఇటుకలు మోయించడం, గడ్డి పీకించడం లాంటి పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఇతర పోలీసులకు దక్కిన కనీస గౌరవం తమ భర్తలకు దక్కడం లేదని నిరసనలు చేస్తున్నారు. పోలీసు విధులకు, వాళ్లు చేస్తున్న పనికి సంబంధం లేదని అంటున్నారు. పండగలకు కూడా ఇంటికి రాకుండా చేస్తున్నారని బెటాలియన్ పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్ విధుల్లోకి వెళ్లిన తమ వారు ఇంటికి రావడానికి నెలల సమయం పడుతుందని చెప్పారు. ఏదైనా అత్యవసర పనులు, శుభకార్యాలకు, ఆస్పత్రి లో ఎమర్జెన్సీ అన్నా కూడా సెలవులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్ళను తరుచూ బదిలీలు చేయడం వల్ల తమ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

ఇకపై ఏక్ స్టేట్ – ఏక్ పోలీస్ రూల్ ఉండాలని డిమాండ్ చేశారు. తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కానిస్టేబుళ్ళ భార్యలు డిమాండ్ చేశారు. అది అమలయ్య వరకు మెస్ తీసి వేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పోలీస్ విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే కానిస్టేబుళ్ళ భార్యలు, కుటుంబ సభ్యులు గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. శుక్రవారం సచివాలయం ముట్టడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కొంతమంది కానిస్టేబుళ్ళ భార్యలు చంటి పిల్లలతో వచ్చి నిరసనలు చేపట్టడంతో స్థానిక పౌరులు, పలువురు రాజకీయ నేతలు సైతం వారికి మద్దతు పలికారు. తమ భర్తకు న్యాయం జరిగే వరకు పోరాటం మరింత ఉధృతం చేస్తామని కానిస్టేబుళ్ళ భార్యలు తెలిపారు. ఈ క్రమంలోనే సచివాలయం వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పరిస్థితి చాలా సున్నితమైనదిగా భావించి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సెలవుల రద్దు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.