iDreamPost
android-app
ios-app

డ్వాక్రా గ్రూపు మహిళలకు గుడ్ న్యూస్…తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  • Published Sep 12, 2024 | 8:46 AM Updated Updated Sep 12, 2024 | 8:46 AM

Good News for Dwakra Women: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. మహిళా సంక్షేమం వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

Good News for Dwakra Women: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. మహిళా సంక్షేమం వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

డ్వాక్రా గ్రూపు మహిళలకు గుడ్ న్యూస్…తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం వివిధ స్కీమ్స్ తీసుకువస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం గా బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం ఆరు గ్యారెంటీ స్కీమ్స్ పైనే చేశారు. అంతేకాదు ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశారు. తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ డ్వాక్రా గ్రూప్ మహిళలకు గొప్ప శుభవార్త. పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మేరకు జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సంఘంలో ఉన్న మహిళలకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఎలక్ట్రిక్ ఆటోను అందజేస్తారు. ప్రభుత్వం స్త్రీనిధి రుణం కింద ఈ ఆటోను కొనుగోలు చేసి ఇస్తారు. అయితే దీనికి సంబంధించిన రుణం వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం సర్కార్ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డ్వాక్రా మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీ పథకాలపై తెలంగాణ ప్రజలకు నమ్మకం కలగడంతో పదేళ్లుగా పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్ కి చెక్ పెట్టి కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్నింటిని అమలు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతను పునర్నిర్వచించిందని, ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పలు సందర్బాల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.