iDreamPost
android-app
ios-app

సింగరేణి కార్మికులకు CM రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాలో ఎంతంటే?

  • Published Oct 24, 2024 | 6:42 PM Updated Updated Oct 24, 2024 | 6:42 PM

Singareni Workers: సింగరేని కాలరీస్ లో కార్మికులు తమ ప్రాణాలకు తెగించి మరి గనుల్లో పనిచేస్తుంటారు. అలాంటి కార్మికులకు దీపావళి కానుకగా అదిరిపోయే కానుక అందించారు సీఎం రేవంత్ సర్కార్.

Singareni Workers: సింగరేని కాలరీస్ లో కార్మికులు తమ ప్రాణాలకు తెగించి మరి గనుల్లో పనిచేస్తుంటారు. అలాంటి కార్మికులకు దీపావళి కానుకగా అదిరిపోయే కానుక అందించారు సీఎం రేవంత్ సర్కార్.

సింగరేణి కార్మికులకు CM రేవంత్ సర్కార్ దీపావళి గిఫ్ట్.. ఒక్కొక్కరి ఖాతాలో ఎంతంటే?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నరవేర్చే దిశలో ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి. తాజాగా సింగరేణి కార్మికులకు దీపావళి కానుగా అదిరిపోయే కానుక అందించారు. దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరి ఖాతాలో రూ.93,750 జమ కానున్నాయి. శుక్రవారం ఈ అమౌంట్ వారి ఖాతాలో క్రెడిట్ అవుతాయని అన్నారు. మొత్తం నలభై రెండు వేల మంది కార్మికులు ఈ బోనస్ అందుకోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రేవంత్ సర్కార్ ప్రకటించిన దీపావళి బంపర్ భొనంజాతో సింగరేణి కార్మికుల ఇళ్లలో ముందుగానే దీపావళి పండుగ వాతావరణం వచ్చినట్లయ్యిందని అంటున్నారు. ఇటీవల ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటున రూ.1.90 లక్షలు జమచేసింది. బోనస్ కింద తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల చొప్పన అందజేసిన విషయం తెలిసిందే. గత ఏడాది సంస్థ ఉత్పత్తి..గడించిన లాభాల ఆధారంగా విజయదశమి బోనస్ ను ప్రకటించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ మరింత ఉత్పత్తులను పెంచింది.

రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు, పలు సంస్థలకు, ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తుంది. 2023-24 సంవత్సరంలో సంస్థకు మొత్తంగా రూ.4,701 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సంస్థ విస్తరణ, పెట్టుబడులకు రూ.2,289 కోట్లు కేటాయించగా.. మిగిలినవి రూ.2,412 కోట్ల రూపాయలు. ఇందులో మూడో వంతు (33 శాతం) రూ.796 కోట్లు ప్రకటిస్తున్నామని దసరా బోనస్ ప్రకటించినపుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.కాగా, సింగరేణి లో 41, 387 మంది శాశ్వత కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం చేకూరే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే సింగరేణి కార్మికులకు పండుగకు ముందే అదిరిపోయే కానుక అందించారు.