P Krishna
Telangana Government: తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులున అప్పుడే వచ్చేశాయి. వేసవి కాలంలో ఉండాల్సిన ఒంటిపూట బడులు అప్పుడే వచ్చాయా అన్న అనుమానాలు వస్తున్నాయా? దానికి గల కారణం ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం..
Telangana Government: తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులున అప్పుడే వచ్చేశాయి. వేసవి కాలంలో ఉండాల్సిన ఒంటిపూట బడులు అప్పుడే వచ్చాయా అన్న అనుమానాలు వస్తున్నాయా? దానికి గల కారణం ఒకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం..
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది టీ సర్కార్. నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. అదేంటీ వేసవి కాలంలో కదా ఒంటిపూట బడులు.. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారన్న అనుమానం రావొచ్చు. దీనికి కారణం ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఒంటి పూట బడులు నిర్వహిస్తూ.. కులగణన కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో సమగ్ర కులగణన కార్యక్రమం కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లను నియమించింది ప్రభుత్వం. 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్స్ సిబ్బంది, 2 వేల మినిస్టీరియల్ సిబ్బంది.. మొత్తం 48,229 మంది ఈ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే మూడు వారాల పాటు కొనసాగనుంది.సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాలలు పనిచేస్తాయి. తర్వాత ఉపాధ్యాయులు సర్వే ప్రక్రియ మొదలు పెడతారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్స్ సర్వే నుంచి మినహాయించారు. రాష్ట్రంలో కులగణన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ నిరంజన్ స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్బంగా తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం నమోదు చేసినా కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించారు. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను అందజేశారు అధికారులు. కులగణనపై ఈ నెల 13వ తేవీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని నిరంజన్ తెలిపారు. ఈ సర్వే గతంలో మాదిరిగా సకలజనుల సర్వేలా ఉండదని అన్నారు. సర్వే రిపోర్ట్ ను దాచిపెట్టకుండా ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కులగణన ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరిగేది కాదని అన్నారు. బీసీ కమిషన్ ముందు స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. సరైన నివేదిక ఇవ్వకుంటే ఆ కులమే తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు. అలాగే కులగణన నేపథ్యంలో సిబ్బందికి ఎలాంటి ఆటంకం కలిగించవొద్దని ప్రజలను కోరారు.స్పష్టమైన సమాచారం ఉంటే రాష్ట్రంలో పాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని అన్నారు. తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ తో పాటు 200 ల యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.