iDreamPost
android-app
ios-app

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక వారికి చుక్కలే!

  • Published Nov 21, 2024 | 11:53 AM Updated Updated Nov 21, 2024 | 11:53 AM

Telangana Government: కొంతమంది కేటుగాళ్ళులు తమ స్వలాభం కోసం యువతను గంజాయి, డ్రగ్స్ కి బానిసలుగా మార్చుతున్నారు. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు.

Telangana Government: కొంతమంది కేటుగాళ్ళులు తమ స్వలాభం కోసం యువతను గంజాయి, డ్రగ్స్ కి బానిసలుగా మార్చుతున్నారు. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు.

  • Published Nov 21, 2024 | 11:53 AMUpdated Nov 21, 2024 | 11:53 AM
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక వారికి చుక్కలే!

ఇటీవల కాలంలో యూత్ జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న యావలో తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ కి బానిసలుగా మార్చుతున్నారు. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడ మాదక ద్రవ్యాల సరఫరాలకు చెక్ పెడుతున్నారు. ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపైనే కాదు.. ఏకంగా వాటి మూలాలను చేధిస్తున్నాయి స్పెషల్ టీమ్స్. వివరాల్లోకి వెళితే..

రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని కట్టడి చేయడానికి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా జిల్లాల్లోని అన్ని యూనిట్స్ లో ఈ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేయనున్నారు. లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైమ్ పీఎస్ ల తరహాలోనే డ్రగ్స్ సహా ఇతర మాదకద్రవ్యాల కేసులను దర్యాప్తు చేయనున్నాయి. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ పర్యవేక్షణలో ఇందులో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగానే వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. స్థానికంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు రిజిస్టర్ చేసే కేసులను కూడా నార్కోటిక్స్ పీఎస్ కు బదిలీ చేస్తారు.

ప్రతి పీఎస్ కు డీఎస్పీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. నార్కొటిక్స్ పీఎస్ లో ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద నమోదు కాబడిన కేసులను కూడా వీరు దర్యాప్తు చేస్తారు. అలాగే స్థానికంగా లా అండ్ ఆర్డర్ పీఎస్ లో పనిచేస్తున్న సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించనున్నారు. గంజాయి, డ్రగ్స్ కేసుల దర్యాప్తులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసు సిబ్బందిని నార్కొటిక్స్ పీఎస్‌లో నియమించున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు పోలీసులు దూకుడు పెంచారు. ఈ విషయంలో సామాన్యులైనా.. సెలబ్రెటీలు అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న పెడ్లర్ల తాట తీస్తున్నారు పోలీసులు. మహారాష్ట్ర, ఒడిషా బార్డర్ నుంచి గట్టిగా నిఘా పెట్టి సిటీలోకి గంజాయి రాకుండా నిర్మూలిస్తున్నారు.

గతంలో గంజాయి, డ్రగ్స్ సప్లై చేసిన ముఠాలను విచారిస్తూ అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి, డ్రగ్స్ దందా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. కానీ, ఎవరో ఒకరు ఈ వ్యవహారాలు లీక్ చేయడంతో పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. చాలా మంది డ్రగ్స్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి సరురుకు స్లమ్ ఏరియాలు, ఇండస్ట్రీయల్ ఏరియాలను అడ్డగా చేసుకొని తాగేవారికి ఒక కోడ్ ఇస్తూ అమ్ముతున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. గంజాయి చాక్లెట్స్ అమ్ముతూ చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తమ వ్యాపారాలు నిర్వహిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మత్తుకు బానిసైనవారు తమ జీవితాలను కోల్పోతున్నారు. మీ చుట్టుపక్కల డ్రగ్స్, గంజాయి వ్యాపారలు జరుగుతున్నట్లు అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలని అధికారులు కోరుతున్నారు.