iDreamPost
android-app
ios-app

రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వారికి కూడా రేషన్!

  • Published Aug 21, 2024 | 8:35 AM Updated Updated Aug 21, 2024 | 8:35 AM

Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు.

Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నారు.

రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వారికి కూడా రేషన్!

గత ఏడాది చివరల్లో తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పదేళ్లు పాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ దిగ్విజయం సాధించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు పలు కీలక హామీలు ఇచ్చింది. వాటిపై నమ్మకంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి తొలి సంతకం ‘ఆరు గ్యారెంటీ’ పథకాలపై చేశారు. కొద్ది రోజుల్లోనే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ చేశారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు. రేషన్ కార్డు విషయంలో మరో శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. వివరాల్లోకి వెళితే..

దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం.. ఆహార శాఖ ద్వారా నిరుపేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తుంటారు. ఈ రేషన్ కార్డుల ఆధారంగానే పేదల ప్రజలకు ప్రభుత్వాలు పథకాలు అందజేస్తాయి. ప్రతి నెల ఉచిత రేషన్ పొందాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణలో స్థానికులకు రేషన్ కార్డులు ఉన్నాయి. గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఎంతోమంది వలస కూలీలు వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. వారికి మాత్రం రేషన్ రావడం లేదు. అలాంటి నిరుపేద కూలీలకు రేషన్ ఇవ్వవాలని గొప్ప నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు కార్యాచరణకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ration shop

సాధారణంగా వలస కూలీలు ఎక్కడా స్థిరంగా ఉండరు.. వారికి ఉపాధి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోతుంటారు. దీని వల్ల వారి ఈ-కేవైసీ పూర్తి కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న వలస కూలీలు ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం కల్పించింది. తెలంగాణలో చాలా వరకు బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, బెంగాల్ నుంచి వలస కూలీలు ఎక్కువగా ఉంటున్నారు. వలస కూలీలు అనేక రంగాల్లో ముఖ్యంగా నిర్మాణ, సేవా, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరి సంఖ్య లక్షల్లో ఉండవొచ్చు. ఇందులో చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి.. కానీ ఈ-కేవైసీ చేసుకోవాలంటే సరైన చిరునామా వారి సొంత రాష్ట్రానిది ఉంటుంది.దీంతో వారికి ఈ-కేవైసీ కావడం లేదు.

ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా రేషన్ డీలర్ నుంచి ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ నెల 12న ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ పౌరసరఫరాల శాఖ అధికారులు వెళ్లాయి. ఈ బాధ్యత తహసీల్దార్లతో పాటు రేషన్ డీలర్లుకు ఉంది. ఈ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డులు ఉన్న వలస కూలీలు.. తమ ఈ-కేవైసీ పూర్తి చేయమని రేషన్ డీలర్లను అడగవొచ్చు..అక్కడ వీలు కాకుంటే నేరుగా తహసీల్దార్‌నే అడవొచ్చు అంటున్నారు. వలస కూలీలకు ఇది మంచి ఛాన్స్.. వెంటనే ఈ-కేవైసీ మార్చుకొని రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ పొందే సదుపాయం పొందవొచ్చు అంటున్నారు.