iDreamPost
android-app
ios-app

Revanth Reddy: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ మహిళల ఖాతాలో రూ.లక్ష

  • Published Aug 14, 2024 | 3:11 PM Updated Updated Aug 14, 2024 | 3:11 PM

Tg Govt-Kalyana Lakshmi: రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో లక్ష రూపాయల నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..

Tg Govt-Kalyana Lakshmi: రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో లక్ష రూపాయల నగదు జమ చేయనుంది. ఆ వివరాలు..

  • Published Aug 14, 2024 | 3:11 PMUpdated Aug 14, 2024 | 3:11 PM
Revanth Reddy: రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ మహిళల ఖాతాలో రూ.లక్ష

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల కింద మహిళల కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. వారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు.. ఇందిరమ్మ ఇళ్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తుంది. వీటితో పాటుగా ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. అలానే మహిళలకు నెలకు 2500 రూపాయల వరకు ఇస్తామని చెప్పింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ మహిళలకు శుభవార్త చెప్పింది. వారి ఖాతాలో లక్ష రూపాయలు నగదు జమ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం తాజాగా కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ స్కీమ్ కింద అర్హులైన వారికి రూ.లక్ష రూపాయల చెక్కు అందజేసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పుర చైర్మన్ దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది మహిళలకు చెక్కులను అందజేశారు.

గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. పేదింటి యువతుల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకువచ్చింది. వీటి ద్వారా అర్హత కలిగిన వారికి ప్రభుత్వం రూ.1,00,116 అందిస్తున్న విషయం తెలిసిందే. కల్యాణ లక్ష్మీ పథకం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అమ్మాయిలకు ఇది వర్తిస్తుంది. ఇక మైనారిటీ అమ్మయిలకు అయితే షాదీ ముబారక్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద మైనారిటీ యువతులకు కూడా రూ. 1,00,116 మేర ఆర్థిక సాయం లభిస్తుంది.

అయితే రేవంత్ సర్కార్ ఈ స్కీమ్స్ కింద అమ్మాయిల పెళ్లిళ్లకు రూ.లక్ష మొత్తంతో పాటుగా తులం బంగారం కూడా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఇంకా ఈ పథకాన్ని ప్రారంభించలేదు. ఎప్పటి నుంచి ఈ ప్రయోజనం అమలు చేస్తారో తెలియాల్సి ఉంది. అయితే ఈ సారి ఈ పథకం అమలుకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. నగదుతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది.