iDreamPost
android-app
ios-app

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గద్దర్‌కు అరుదైన గౌరవం

  • Published Aug 07, 2024 | 3:29 PM Updated Updated Aug 07, 2024 | 3:29 PM

Key Decision of Telangana Government: తెలంగాణ కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు.. ఎంతోమంది కళాకారులు తమ నృత్యగానాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అలాంటి వారిలో ఉద్యమనేత, యుద్దనౌకగా పేరు తెచ్చుకున్నారు గద్దర్.

Key Decision of Telangana Government: తెలంగాణ కోసం ఎంతోమంది వీరులు తమ ప్రాణాలు త్యాగం చేశారు.. ఎంతోమంది కళాకారులు తమ నృత్యగానాలతో ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. అలాంటి వారిలో ఉద్యమనేత, యుద్దనౌకగా పేరు తెచ్చుకున్నారు గద్దర్.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..  గద్దర్‌కు అరుదైన గౌరవం

ప్రముఖ రచయిత, సంగీత, నృత్య కళాకారుడు గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కోట్లమంది ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపారు. గత ఏడాది ఆగస్టు 7న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాతున్న ఆయన ఎన్నో పాటలు రచించి పాడారు. ‘మా భూమి’ సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి ‘బండెనక బండి కట్టి’ అనే పాటపై ఆడి, పాడారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది. నేడు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న యాదిలో.. పేరుతో జరిగి ఈ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గద్దర్ ఒక ఉద్యమ స్ఫూర్తి, ఆయన ఆలోచనా విధానాన్ని ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేస్తాం. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాంతం పరితపించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహనీయుడు, మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లె తిరుగుతూ తన ఆట, పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. తాడిత, పీడిత వర్గాల విముక్తి కోసం, అందరికీ సమ న్యాయం, సమానత్వం కోసం పోరాడాలంటూ ప్రజల్లో చైతన్యం కల్పించారు’ అని అన్నారు.

డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..‘ తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నాం.   భవిష్యత్ లో గద్దర్ ఆశయాలను కొనసాగిస్తాం.. నక్లెస్ రోడ్డులో గద్దర్ స్మృతి వనం నిర్మించి నిత్యం పరిశోధనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరంన్నర స్థలాన్ని కేటాయిస్తాం. అంతేకాదు ఆయనపై పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ.3 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆయన ప్రజా ఉద్యమాలకు దిక్సూచి’. ఆయన లేని లోటు తీర్చలేం అంటు ఘన నివాళి అర్పించారు.