మీరు రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా చూశారా? అయితే మీకు పక్షిరాజా గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో పక్షులకు సెల్ టవర్లు హాని చేస్తున్నాయనే కారణంతో మొత్తం సెల్ టవర్లు, మొబైల్ ఫోన్ల పైనే యుద్ధం చేసినంత పని చేస్తాడు పక్షిరాజా. తాజాగా తమిళనాడులో 600 సెల్ టవర్లు కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో మరోసారి పక్షిరాజాను గుర్తు చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే? GTL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తమిళనాడులో అనేక సెల్ టవర్లు ఏర్పాటు చేసింది. అయితే […]
రద్దీగా ఉన్న రోడ్డుపై అందదరూ చూస్తుండగా ఫుడ్ డెలివరీ ఏజెంట్ పై చేయి చేసుకున్నాడో ట్రాఫిక్ పోలీస్. ఫలితంగా ఆ పోలీస్ ను పోలీస్ కంట్రోల్ రూమ్ కు ట్రాన్స్ఫర్ చేశారు ఉన్నతాధికారులు. తమిళనాడులోని సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. సింగనల్లూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన గ్రేడ్ 1 కానిస్టేబుల్ సతీశ్ అవినాశి రోడ్ లోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద డెలివరీ పర్సన్ ను చెంపదెబ్బ కొట్టాడు. ప్రముఖ ఫుడ్ అగ్రిగేటర్ అయిన […]
ఇటీవల విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర ఓటమిని చవిచూసింది. అధికార డీఎంకే పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఈ ప్రభావం అన్నాడీఎంకేపై పడింది. సరైన నాయకత్వం లేకపోవడంవల్లనే ఇలాంటి ఫలితాలు వచ్చాయనే భావన అన్నాడీఎంకే నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకుని మళ్లీ పార్టీలో చేరి,పట్టుసాధించేందుకు శశికళ రంగంలోకి దిగారు. ఈ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఈ పర్యటనలో […]
ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. నానా ఫీట్లు చేస్తుంటారు. ఓటర్ల ఇండ్లలో పనులు చేస్తూ ఫొటోలకు పోజులిస్తుంటారు. ఇక తమిళనాడులో ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. చోటామోటా నాయకులే కాదు.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం రంగంలోకి దిగింది. రజనీపై రాజకీయం కలిసొస్తుందా? తమిళనాడులోనే కాదు.. దేశ విదేశాల్లోనూ క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్. తాను పార్టీ […]
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఎంత కింద మీద పడుతుందో అర్థం కావడానికి ఈ చిత్రమే నిదర్శనం. అన్నాడీఎంకే నూ, జయలలిత వారసత్వాన్ని పార్టీకి (కూటమి ) మాత్రమే చెందేలా బీజేపీ పెద్దలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీనిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిపూజ అధికం. దానికి బిజెపి పూర్తి విరుద్ధం. అయితే ఓట్ల వేటలో సాక్షాత్తు ప్రధానికి సైతం కూటమి లోని ప్రధాన పార్టీని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యం […]
నటుడు విజయ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు విజయ్ అభిమానులు. తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు కుంభకోణంలోని అతని అభిమానులు విజయ్ ఫోటోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి వీధుల్లో అంటించారు. విజయ్, ఈ నెల 22న 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కరోనా తమిళనాడు అంతా విపరీంతా వ్యాప్తి చెందడంతో, విజయ్ తన పుట్టినరోజు వేడుకల కార్యకలాపాలకు పాల్పడవద్దని అభిమానులను ఆదేశించారు. అయితే, అతని అభిమానులు విజయ్ను పుట్టిన […]
కరోనా వైరస్ వ్యాప్తి, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారని ఓ పక్క ప్రచారం జరుగుతున్న తరుణంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేసులు సంఖ్య ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలకే ఆ లాక్డౌన్ను పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని చెన్నై, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, తిరువళ్లూర్, చెంగల్పేట్, కాంచీపురం జిల్లాలో ఈ నెల 19 నుంచి 30 వరకూ 12 రోజుల […]
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అటు తమిళనాడులోనూ, ఇటు దక్షిణ భారతంలోనూ ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతుంది. అయితే రాజకీయ ప్రవేశం ఇంకా జరగలేదు. ఆయన అభిమానులు మాత్రం రజినీ రాజకీయ రంగ ప్రవేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యం అని పదే పదే చెబుతున్నారు. కాగా నటుడు రజినీ కాంత్ కూడా ఇటీవల […]
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తో డిఎంకె ఎమ్మెల్యే అన్బళగన్ కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన ఎమ్మెల్యే అన్బళగన్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.పళనీస్వామి ట్విట్టర్లో ప్రకటించారు. అన్బళగన్ ప్రస్తుతం చేప్పాక్కం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడే అన్బళగన్ మరణించారు. కరోనా సోకి ఒక శాసన సభ్యుడు మరణించడం దేశంలో ఇదే ప్రథమం. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే […]
దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) రోజురోజుకూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. కొన్ని రోజులుగా రోజుకు దాదాపు 10 వేలకు దగ్గరగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో పది రాష్ట్రాల నుంచే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్నది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 84 శాతం కేసులు ఈ పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అలాగే, […]