iDreamPost
android-app
ios-app

మోడీ స్టేడియాన్ని మించేలా అతిపెద్ద స్టేడియానికి ప్లానింగ్! ఎక్కడంటే?

  • Published Aug 10, 2024 | 9:01 PM Updated Updated Aug 10, 2024 | 9:01 PM

Biggest Cricket Stadium: దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని చెప్పొచ్చు. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ స్టేడియంలో ఎన్నో బిగ్ మ్యాచెస్ జరిగాయి.

Biggest Cricket Stadium: దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని చెప్పొచ్చు. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ స్టేడియంలో ఎన్నో బిగ్ మ్యాచెస్ జరిగాయి.

  • Published Aug 10, 2024 | 9:01 PMUpdated Aug 10, 2024 | 9:01 PM
మోడీ స్టేడియాన్ని మించేలా అతిపెద్ద స్టేడియానికి ప్లానింగ్! ఎక్కడంటే?

దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా కొనసాగుతోంది అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం. 1.32 లక్షల సీటింగ్ కెపాసిటీతో ఉన్న ఈ స్టేడియంలో ఎన్నో కీలక మ్యాచ్​లు జరిగాయి. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ సహా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇందులోనే జరిగింది. ఇంతకుముందు మొతేరా పేరుతో ఉన్న ఈ స్టేడియాన్ని ఆధునీకరించిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంగా నామకరణం చేశారు. హ్యూజ్ సీటింగ్ కెపాసిటీ, అధునాతన సౌకర్యాలు ఉండటంతో ముఖ్యమైన మ్యాచ్​ల నిర్వహణకు ఈ స్టేడియానికే ఇంపార్టెన్స్ ఇస్తోంది బీసీసీఐ. అయితే ఇక మీదట ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్వహణకు సన్నాహకాలు ఊపందుకున్నాయి.

అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని మించిపోయేలా నూతన స్టేడియం నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో ఈ స్టేడియాన్ని కట్టనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియం ఉంది. ఐపీఎల్​తో పాటు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ మ్యాచ్​లకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. అయితే రాష్ట్రంలో మరో అధునాతన స్టేడియం ఉండాలనే ఆకాంక్షతో విశాలమైన ప్రాంతంలో స్టేడియం నిర్మించాలని స్టాలిన్ సర్కారు భావిస్తోందట. రాష్ట్రంలో క్రికెట్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను పెంచుతామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దృష్ట్యా బిగ్గెస్ట్ స్టేడియం ప్లానింగ్​ను వేగవంతం చేశారని సమాచారం.

కోయంబత్తూరు సిటీ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే 544కు సమీపంలో కొత్త స్టేడియాన్ని నిర్మించనున్నారని వినిపిస్తోంది. మోడీ స్టేడియం సహా దేశంలో ఉన్న అన్ని స్టేడియాల్లో కంటే అత్యంత ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంగా దీన్ని రూపొందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందట. టెండర్ల ప్రక్రియను కూడా స్పీడప్ చేశారని.. త్వరలోనే డిజైన్ కూడా వచ్చేస్తుందని సమాచారం. ప్లేయర్ల లాంజ్, మీడియా సెంటర్, పబ్లిక్ కెఫెటీరియా, రెస్టారెంట్స్, ఆడియెన్స్ గ్యాలరీస్, క్రికెట్ మ్యూజియం, ట్రైనింగ్ ఫెసిలిటీస్, ఇండోర్ ప్రాక్టీస్ ఏరియా, హై-పెర్ఫార్మెన్స్ సెంటర్​ లాంటివి స్టేడియంలో ఉండేలా డిజైన్లను తయారు చేయిస్తున్నారట. ఒకవేళ ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే మోడీ స్టేడియాన్ని అధిగమించడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.