iDreamPost
android-app
ios-app

తమిళనాడులో PUSHPA 2 మూవీ సెన్సేషన్! రికార్డ్స్ ఇక తగ్గేదేలే!

  • Published Nov 25, 2024 | 2:43 PM Updated Updated Nov 25, 2024 | 2:43 PM

Pushpa 2: పుష్ప 2 తమిళనాడులో సెన్సేషన్ సృష్టించింది. అక్కడ పుష్ప 2 ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

Pushpa 2: పుష్ప 2 తమిళనాడులో సెన్సేషన్ సృష్టించింది. అక్కడ పుష్ప 2 ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

  • Published Nov 25, 2024 | 2:43 PMUpdated Nov 25, 2024 | 2:43 PM
తమిళనాడులో PUSHPA 2 మూవీ సెన్సేషన్! రికార్డ్స్ ఇక తగ్గేదేలే!

ఇకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుష్ప 2 వైల్డ్‌ ఫైర్‌ ఈవెంట్‌ తమిళనాట గట్టిగానే ఫైర్ అయ్యింది. ఇప్పటి వరకు తమిళనాడులో ఏ డబ్బింగ్ సినిమాకి దక్కని సాలిడ్ రెస్పాన్స్‌ పుష్ప 2 ఈవెంట్‌కి సాధ్యం అయ్యింది. తమిళనాడులో సాధారణంగా పర భాష సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు తమిళ జనాలు. అయితే అలాంటి చోట పుష్ప 2 తగ్గకూడదని ఫిక్స్ అయ్యింది. అందుకే తమిళ స్టార్‌ హీరోల సినిమాలలాగానే ఈ సినిమాకి భారీ ఈవెంట్‌ను చేశారు. అక్కడి డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ భారీగా దీన్ని ప్లాన్‌ చేసింది. అయితే పుష్ప 1 కోలీవుడ్ లో సోసోగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఓటీటీ, శాటిలైట్‌ ద్వారా పుష్ప కి మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. పైగా పుష్ప పై సోషల్‌ మీడియా ఇంపాక్ట్ మామూలుగా లేదనే చెప్పాలి. అందుకే తమిళనాట కూడా పుష్పకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఆ క్రేజ్ తోనే పుష్ప 2 ను మాంచి రేటుకే ఫేమస్ ప్రొడక్షన్ కంపెనీ ఏజీఎస్‌ కొనుగోలు చేసింది. మరి తమ రేటుకి న్యాయం చేయాలిగా. అందుకే ఏమాత్రం తగ్గట్లేదు. తమిళనాడులో ఎక్కువ స్క్రీన్స్ లో ఎక్కువ షోస్ వేయనున్నారు. ఈ విషయంలో ది గోట్‌ సినిమా తరువాత పుష్ప 2 రికార్డులు సృష్టించిందనే చెప్పాలి.

గతంలో ది గోట్ దాదాపుగా 900 స్క్రీన్స్‌లో మొదటి రోజు 4000 షోలతో తమిళనాడులో రికార్డులు క్రియేట్ చేసింది. అయితే పుష్ప 2 సినిమాను తమిళనాడులో ఏకంగా 800 స్క్రీన్‌లలో దాదాపుగా 3500షోలతో విడుదల చేయబోతున్నారు.ఈ లెక్కన పుష్ప 2 కి జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు తమిళ నాట డే 1 రికార్డులు పక్కా. ది గోట్‌ మొదటి రోజు తమిళనాట సాధించిన వసూళ్లకు కాస్త అటు ఇటుగా పుష్ప 2 వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ది గోట్‌ సినిమా తమిళనాట డే 1 దాదాపుగా రూ.38 కోట్ల వసూళ్లు సాధించింది. ఇక పుష్ప 2 కూడా టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా రూ.30 కోట్ల పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం లాంగ్‌ రన్‌లో తమిళనాట భారీ వసూళ్లు చేసే అవకాశాలు పుష్ప 2 కి పుష్కలంగా ఉన్నాయి. దీంతో తెలుగు సినిమాలు తమిళ్‌లో ఎక్కువ వసూళ్లు సాధించలేవు అనే అపవాదును పుష్ప 2 బ్రేక్‌ చేస్తుంది.

పుష్ప 2 సినిమాకు తమిళనాడులో దాదాపుగా రూ.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ కావాలంటే కచ్చితంగా రూ.55 కోట్ల షేర్‌ వసూళ్లు రావాలి. ఆ లెక్కన రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తేనే తమిళనాట పుష్ప 2 బ్రేక్ ఈవెన్‌ అవుతుంది. అయితే పుష్ప 2 కి హిట్ టాక్ వస్తే.. ఆ వసూళ్లు రావడం పెద్ద కష్టమేమి కాదు. పైగా అక్కడ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, రికార్డ్‌ స్థాయి స్క్రీన్స్‌ లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా భారీ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. మరి పుష్ప రాజ్ తమిళ నాట ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom