iDreamPost
android-app
ios-app

నన్ను దారుణంగా అవమానించారు.. నమిత ఆవేదన

  • Published Aug 26, 2024 | 8:44 PM Updated Updated Aug 26, 2024 | 8:44 PM

Actress Namitha: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది నమిత. కృష్ణాష్టమి సందర్భంగా తనకు దేవాలయంలో అవమానం జరిగిందని సంచలన కామెంట్స్ చేసింది.

Actress Namitha: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది నమిత. కృష్ణాష్టమి సందర్భంగా తనకు దేవాలయంలో అవమానం జరిగిందని సంచలన కామెంట్స్ చేసింది.

నన్ను దారుణంగా అవమానించారు.. నమిత ఆవేదన

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టిన హీరోయిన్ నమిత గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కెరీర్ బిగినింగ్ లో సన్నగా నాజూగ్గా ఉన్న ఈ అమ్మడు తర్వాత కాలంలో బొద్దుగా మారింది. అయినా కూడా ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడా తగ్గలేదు. కెరీర్ డల్ అయినపుడు ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించింది. తర్వాత కాలంలో బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోస్ లో మెరిసింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి.. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. నమిత తనకు అవమానం జరిగిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ నమిత తాజాగా తనకు ఆలయంలో చేదు అనుభవం జరిగిందని సెన్సెషన్ కామెంట్స్ చేసింది. మధుర మీనాక్షి దేవాలయ సిబ్బంది తనతో అమర్యాదగా ప్రవర్తించారని, తనని దేవాలయంలోకి వెళ్లనివ్వలేదని ఆరోపించారు. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లగా ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అక్కడ సిబ్బంది అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ చూపించాలని అడిగారని, తను ఒక సెలబ్రెటీ విషయం తెలిసి కూడా అవమానించారని తెలిపింది.

తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా నేను ఎన్నో ప్రముఖ ఆలయాలను దర్శించుకొని పూజలు జరిపించాని చెప్పినా వినిపించుకోలేదు.  నాకు జరిగిన అవమానం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని బాధపడింది. ఆ సిబ్బదిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం నమితకు సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే నమిత వ్యాఖ్యలపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించారు. నమితతో ఎవరూ అమర్యాదగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం.. పై అధికారులు చెప్పడంతో కొంత సమయం ఆగమని చెప్పాం.. ఆ తర్వాత ఆమెను దేవాలయంలోకి అనుమతించాని తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Namitha Vankawala (@namita.official)