iDreamPost
android-app
ios-app

చిన్న వయసులోనే దానికి అడిక్ట్ అయ్యింది! నర్స్ కావాలనుకుని!

ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు కూడా ఏం చెప్పలేకపోతున్నారు పేరెంట్స్. చెప్పింది అర్థం చేసుకోకుండా.. ఎదురు సమాధానం చెబుతుంటారు. దీంతో పిల్లల్ని ఒక్కటి పీకడమో, లేక తిట్టడమో చేస్తున్నారు.. ప్రతిఫలం

ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు కూడా ఏం చెప్పలేకపోతున్నారు పేరెంట్స్. చెప్పింది అర్థం చేసుకోకుండా.. ఎదురు సమాధానం చెబుతుంటారు. దీంతో పిల్లల్ని ఒక్కటి పీకడమో, లేక తిట్టడమో చేస్తున్నారు.. ప్రతిఫలం

చిన్న వయసులోనే దానికి అడిక్ట్ అయ్యింది! నర్స్ కావాలనుకుని!

ఈ రోజుల్లో ఎవర్ని ఏమీ అనలేని పరిస్థితి. చివరకు కన్న బిడ్డల్ని కూడా. అమ్మ ఏదైనా పని చెప్పగానే.. నాకే ఎందుకు చెబుతున్నావని అంటూ ప్రశ్నిస్తుంటారు. ఇక ఓ మాట అనగానే.. అస్తమాను తమపై కసురుకుంటుందని, చీవాట్లు పెడుతుందని, చదువుకోమని చెబుతుందని బాధపడుతున్నారే తప్ప.. తమ మంచికే చెబుతుందన్న ఆలోచన చేయరు. వయసు ప్రభావం అలాంటిది. ముఖ్యంగా టీనేజ్ యువతీ యువకులు ఇలానే ఉన్నారు. సమయం వృధా చేస్తూ.. సెల్ ఫోన్, టీవీలపై పెట్టే శ్రద్ధ పెడుతున్నారు. పుస్తకాలు తీయమని తల్లి చెప్పగానే ఆమెను విలన్‌గా చిత్రీకరించి.. తండ్రికి కంప్లయింట్ లేదా అన్నం మీద అలుగుతుంటారు. ఇక కొంత మంది పిల్లలైతే పేరెంట్స్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

అస్తమాను ఫోన్ చూస్తుందన్న కోపంతో తల్లి కసురుకోవడంతో ఆత్మహత్య చేసుకుంది నర్సింగ్ విద్యార్థిని. మంచి చెప్పినందుకు తనువు చాలించింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. బూతపాండి సౌత్ స్ట్రీట్ ప్రాంతంలో నివసిస్తోంది నిర్మల కుటుంబం. ఆమెకు కొడుకు, కూతురు అక్షయ ఉన్నారు. కూతురు తీతల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. బస్సులో కాలేజీకి వెళుతూ వస్తుండేది. ఇంటికి వచ్చాక అమ్మకు పనిలో హెల్ప్ చేయాల్సిన కూతురు ఫోన్ పట్టుకుని కూర్చునేది. అందులోనే కాలక్షేపం చేస్తూ ఉండిపోయేది. తల్లి నిర్మల ఏ పని చెప్పినా విసుక్కునేది. పలుమార్లు తల్లి చెప్పి చెప్పి విసిగిపోయింది.

ఈ మధ్య కాలంలో అక్షయ అస్తమాను చాలా సేపు సెల్ ఫోన్ చూస్తూ ఉండటంతో నిర్మల మందలించింది. తల్లి తిట్టిందన్న కోపంతో ఆవేశంగా తన గదిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కూతురు ఎంతసేపటికి గదిలో నుండి రాకపోవడంతో తల్లి నిర్మల వెళ్లి చూడగా.. అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించింది. ఇరుగు పొరుగు సాయంతో ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఫోన్ చూడద్దు అన్నందుకు ఇంత పని చేశావా అక్షయ అంటూ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. నర్సింగ్ చదివి ఉద్యోగం చేస్తుందనుకుంటే మృత్యు ఒడికి చేరింది. తల్లిని ఓదార్చడం స్థానికుల తరంకాలేదు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాలా సేపు సెల్ ఫోన్ చూస్తున్నందుకు తల్లి మందలించడంతోనే నర్సింగ్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్దారించారు.