iDreamPost
android-app
ios-app

50 మంది భర్తలను మార్చిన భార్య అరెస్ట్.. ఎలా దొరికిదంటే..?

  • Published Jul 15, 2024 | 7:52 PM Updated Updated Jul 15, 2024 | 7:52 PM

డీఎస్పీతో సహా పలువురు మగవాళ్లను ప్రేమ వల వేసి, పెళ్లి చేసుకుని మోసం చేసి, డబ్బులతో ఉడాయించిన సత్య ఎట్టకేలకు దొరికిపోయింది. ఆమెను ఎలా పట్టుకున్నారంటే..??

డీఎస్పీతో సహా పలువురు మగవాళ్లను ప్రేమ వల వేసి, పెళ్లి చేసుకుని మోసం చేసి, డబ్బులతో ఉడాయించిన సత్య ఎట్టకేలకు దొరికిపోయింది. ఆమెను ఎలా పట్టుకున్నారంటే..??

  • Published Jul 15, 2024 | 7:52 PMUpdated Jul 15, 2024 | 7:52 PM
50 మంది భర్తలను మార్చిన భార్య అరెస్ట్.. ఎలా దొరికిదంటే..?

50 మందిని ఒకరికి తెలియకుండా మరొకర్ని పెళ్లి చేసుకుంటూ.. కొన్నాళ్లు కాపురం చేశాక.. డబ్బులు, నగదుతో ఉడాయించిన మహిళను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఆమె బాధితుల్లో డీఎస్పీతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. తారాపురం ఉడుమలై రోడ్డులో ఉంటూ బేకరీ నడుపుతున్నమహేష్ అరవింద్.. పెళ్లి కోసం ఓ ఆన్ లైన్ వివాహ వేదికగా సంప్రదించగా.. ఈ రోడ్ జిల్లా కొడుమూడి సమీపంలోని ఒతకడైకి చెందిన పళని స్వామి కుమార్తె సత్య మహిళతో పరిచయం ఏర్పడింది. సత్య తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పి నమ్మించింది. మెల్లిగా స్నేహం, ఆ తర్వాత ప్రేమ అంటూ నమ్మించింది. చివరకు అతడ్ని పెళ్లి చేసుకుంది.

అయితే మూడు నెలల తర్వాత ఆమె రూపు రేఖల్లో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. తరచుగా పర పురుషులతో ఫోనులో మాట్లాడటంతో పాటు ఆమె ఫోనులో అబ్బాయిలతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు చూసి ఖంగుతిన్నాడు. ఓ రోజు ఆధార్ కార్డు చూడగా భర్త ప్లేసులో తన పేరుకు బదులు మరొకరి పేరు ఉండటంతో ఆమెను నిలదీయగా.. ఆమె ఇచ్చిన షాకులకు షేకై పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడు ఆమె బాధితుల సంఖ్య బయటపడింది. అంతలో పెళ్లికి ఇచ్చిన నగలతో ఉడాయించింది పెళ్లి కూతురు. ఈ నాటకంలో మరొకరి పాత్ర కూడా ఉంది. సత్య బంధువుగా చెప్పుకుంటున్న తమిళ చెల్విని దీనికి కారణమని గుర్తించాడు. సత్యకు ఏజెంట్‌గా తమిళ చెల్వి వ్యవహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 21న తమ పెళ్లి కాగా, తమ వివాహాన్ని తమిళ చెల్వి నిర్వహించినట్లు తెలిపాడు.

ఇద్దరు పరారీలో ఉన్నారని , వారిని పట్టుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ముమ్మురంగా దర్యాప్తు చేపట్టారు. వీరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రాక్ చేయగా.. సత్య పుదుచ్చేరిలో తలదాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి అక్కడకు తరలించి.. నిత్య పెళ్లి కూతురు, కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నారు. సత్య పలువురిని ప్రేమించి, పెళ్లి చేసుకుని మోసం చేసిందన్న ఆరోపణలున్నాయని తెలిపారు. ఆమె పలువుర్ని ప్రేమ పేరుతో వంచించి, చీటింగ్ చేసిందన్న ఆరోపణలపై పోలీసులు స్పందిస్తూ.. బాధితులు ఇంకా ముందుకు రాలేదని, వస్తే నంబర్ చెబుతామని పేర్కొన్నారు. ఎట్టకేలకు నిత్య పెళ్లి కూతురు సత్యను అరెస్టు చేశారు. ఆమెకు సపోర్టుగా నిలిచి తమిళ చెల్వి ఇంకా పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş