iDreamPost
android-app
ios-app

అందాల పోటీల్లో తల్లీకూతుళ్ల సరికొత్త రికార్డు!

  • Published Aug 05, 2024 | 9:33 AM Updated Updated Aug 05, 2024 | 9:33 AM

Miss and Mrs World Titles: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారి పోషణ కోసం ఎంతో కష్టపడుతుంటారు. కొన్నిసార్లు తల్లి తన పిల్లల మంచి కెరీర్ కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ తల్లి తన కూతురుతో కలిసి అందాల పోటీలో అద్భుతం సృష్టించింది.

Miss and Mrs World Titles: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారి పోషణ కోసం ఎంతో కష్టపడుతుంటారు. కొన్నిసార్లు తల్లి తన పిల్లల మంచి కెరీర్ కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ తల్లి తన కూతురుతో కలిసి అందాల పోటీలో అద్భుతం సృష్టించింది.

అందాల పోటీల్లో తల్లీకూతుళ్ల సరికొత్త రికార్డు!

సాధారణంగా తల్లీ కూతుళ్లు కలిస్తే ఇంట్లో విషయాల గురించి మాట్లాడుకోవడమో.. వంట గదిలో వంటలు చేయడమో.. సీరియల్స్ గురించి ముచ్చట్లు పెట్టుకోవడమే చేస్తుంటారు అని చెప్పేవారికి చెన్నైకి చెందిన తల్లీ, కూతురు గొప్ప సమాధానం చెప్పారు. పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనా చూసుకుంటూ తమ సౌందర్యం గురించి మర్చిపోతున్న ఈ కాలంలో ఓ తల్లి తన కూతురితో కలిసి అందాల పోటీల్లో పాల్గొని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చెన్నై నగరానికి చెందిన తల్లీ, కూతురు మిస్ వరల్డ్, మిసెస్ వరల్డ్ గా ఎన్నికై దేశస్థాయిలో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి.. ఆ తల్లీ కూతుళ్లు ఎవరు అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో రాయల్ క్రూస్ నౌకలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు మిస్ వరల్డ్, మిసెస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో 70 దేశాల నుంచి పోటీలో పాల్గొనడానికి అందగత్తెలు వచ్చారు. వారిలో చెన్నైకి చెందిన డాక్టర్ ఫ్లారెన్స్ హెలెన్ నళిని‘ మిస్ స్పిరిట్ ఆఫ్ వరల్డ్ యూనివర్సి అండ్ మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ పీపుల్’ టైటిల్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ఆమె కూతురు సరిహా చౌదరి ‘మిస్ వరల్డ్ యూనివర్సల్ 2024’ టైటిల్ కైవసం చేసుకుంది. ఇలా ఏక కాలంలో తల్లీకూతుళ్లు అందాల పోటీలో పాల్గొని విజయం సాధించడం అద్భుతమైన విషయం అంటున్నారు. ఈ సందర్బంగా సరిహా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు.

సరిహా మాట్లాడుతూ.. ‘తొలి ప్రయత్నంలోనే ఇంత గొప్ప పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ మిసెస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం చూసి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలనే కోరిక నాకు కలిగింది. వాస్తవానికి మా అమ్మకు మోడలింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. ఆమె ఒక డాక్టర్, వ్యాపారవేత్త, రచయిత  బహుముఖ ప్రజ్ఞాశాలి. 2022 లో  ఫ్లోరిడాలోని మాయామీలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో భారత్ తరుపున ప్రాతినిధ్య వహించింది. 2021లో మిసెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాసిక్,  ‘గ్లామరస్ ఎచీవర్’ టైటిల్ గెల్చుకుంది. 2022లో ‘మిస్ ఇంటర్నేషనల్ వరల్డ్ పీపుల్ చాయిస్ విన్నరు 2022’ టైటిల్ గెల్చుకుంది.. ఇప్పుడు మళ్లీ నాతో పాటు ఈ పురస్కారం దక్కించుకోవడం జరిగింది’ అని చెప్పింది. 1984 నుంచి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి.